Pawan Kalyan: అయోధ్య రామాలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ భావోద్వేగం..

దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల హృదయాలు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కోసం ఎదురు చూశాయి. అలాంటి అద్భుత ఘట్టం జనవరి 22న ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 12:38 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరి తరఫున ప్రతినిధిగా నిలిచి ఈ మహత్తర కార్యంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

Pawan Kalyan: అయోధ్య రామాలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ భావోద్వేగం..
Pawan Kalyan

Updated on: Jan 22, 2024 | 5:01 PM

అయోధ్య, జనవరి 22: దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల హృదయాలు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కోసం ఎదురు చూశాయి. అలాంటి అద్భుత ఘట్టం జనవరి 22న ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 12:38 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరి తరఫున ప్రతినిధిగా నిలిచి ఈ మహత్తర కార్యంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా బాల రాముని సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. “ఈ రోజు నాకు చాలా భావోద్వేగంగా ఉంది. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో నా కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి.

ఈ అద్భుతమైన మహోత్సవం భారతదేశాన్ని ఒకే జాతిగా బలోపేతం చేసింది. శ్రీరామచంద్రుడు ధర్మం, సహనం, త్యాగం, ధైర్యసాహసాలకు ప్రతిరూపం. అందరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తారు. శ్రీరాముని మార్గంలోనే భారత దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయోధ్య రామాలయ నిర్మాణంలో మనందరం పాల్పంచుకోవడం సమీష్టి బాధ్యత” అని పేర్కొన్నారు. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రత్యేక విమానంలో లక్నో వెళ్లి.. అక్కడి నుంచి అయోధ్య బాల రాముని సన్నిధికి చేరుకున్నారు పవన్. గతంలో అయోధ్య ఆలయానికి రూ. 30లక్షలు విరాళం ప్రకటించారు. 500 ఏళ్ళ నాటి కల సాకారమవుతున్న వేళ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..