Boat Accident: రాఖీ పండగ కోసం పుట్టింటికి వెళ్తున్న మహిళలు.. పడవ బోల్తాపడి 20మంది మృత్యువాత..!

|

Aug 11, 2022 | 5:35 PM

రాఖీ పండగ కోసమని పడవలో బయల్దేరిన మహిళల్ని ఆ నది మింగేసింది. వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడి మహిళలు సహా 20 మంది జలసమాధి అయ్యారు. ఈ విషాద సంఘటన

Boat Accident: రాఖీ పండగ కోసం పుట్టింటికి వెళ్తున్న మహిళలు.. పడవ బోల్తాపడి 20మంది మృత్యువాత..!
Boat
Follow us on

Boat Accident: రాఖీ పండగ కోసం మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. తమ అన్నాదమ్ములకు రాఖీ కట్టేందు కోసమని ఒకరోజు ముందగానే పుట్టింటికి చేరుకుంటారు. ఈ క్రమంలోనే రాఖీ పండగ కోసమని పడవలో బయల్దేరిన మహిళల్ని ఆ నది మింగేసింది. వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడి మహిళలు సహా 20 మంది జలసమాధి అయ్యారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో పడవ బోల్తా పడిన ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు. బందాలోని మార్కా ఘాట్ నుండి ఫతేపూర్ వెళ్తున్న పడవ అదుపుతప్పి యమునా నదిలో మునిగిపోయింది. పడవలో దాదాపు 40 మంది ఉండగా అందులో 20 నుంచి 25 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. ఈ మహిళలు రక్షాబంధన్ రోజున రాఖీ కట్టేందుకు తమ పుట్టింటికి వెళ్తున్నారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

SDRF బృందాలతో పాటు, స్థానికులు కూడా గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలికి అధికారులను పంపారు. సహాయ, సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి