Parvati Idol: 50 ఏళ్ల క్రితం చోరీకి గురైన చోళుల కాలం నాటి విగ్రహం.. న్యూయార్క్ వేలం హాల్ లో గుర్తింపు

|

Aug 09, 2022 | 1:31 PM

మే 12, 1971న కుంభకోణంలోని నదనపురీశ్వరార్ ఆలయంలో ఐదు విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఆ విగ్రహాల్లో ఒకటి పార్వతి దేవి విగ్రహం. అప్పట్లోనే విగ్రహం అదృశ్యం విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు

Parvati Idol: 50 ఏళ్ల క్రితం చోరీకి గురైన చోళుల కాలం నాటి విగ్రహం.. న్యూయార్క్ వేలం హాల్ లో గుర్తింపు
Parvati Idol
Follow us on

Parvati Idol: భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక పురాతన ఆలయాలు, విగ్రహాలు నేటికీ ఆకట్టుకునే ఉన్నాయి. అయితే మనదేశంలోని పురాతన విగ్రహాలు చోరీకి గురై.. విదేశాలకు తరలి వెళ్లిపోయాయి. పలు సందర్భాల్లో మన దేవతల విగ్రహాలు విదేశాల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా 50 ఏళ్ల క్రితం చోరీకి గురైన చోళుల కాలం నాటి విగ్రహం అగ్రరాజ్యం అమెరికాలో దర్శనమిచ్చింది. తమిళనాడులోని ఓ ఆలయంలో 1971లో చోరీకి గురైన పార్వతీ దేవి విగ్రహం న్యూయార్క్‌లోని బోన్‌హామ్స్ ఆక్షన్ హాలులో ఉన్నట్లు తమిళనాడు పోలీసు ఐడల్ వింగ్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 12, 1971న కుంభకోణంలోని నదనపురీశ్వరార్ ఆలయంలో ఐదు విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఆ విగ్రహాల్లో ఒకటి పార్వతి దేవి విగ్రహం అని చెప్పారు. అప్పట్లోనే విగ్రహం అదృశ్యం విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే కేసు నమోదు చేసుకోలేదు. దీంతో మళ్ళీ ఆలయ ధర్మకర్త కె.వాసు 2019లో మరో ఫిర్యాదు చేశారు. సీఐడీ ఐడల్‌ వింగ్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా.. కేసు పెండింగ్‌లో ఉంది.

ఐడల్ వింగ్ ఇన్‌స్పెక్టర్ ఎం చిత్ర నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. విగ్రహాన్ని వెలికితీసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న వివిధ మ్యూజియాలు, యాక్షన్‌ హౌస్‌ల్లో చోళులకాటి నాటి పార్వతి విగ్రహం గురించి ఆరాతీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ విగ్రహం తమిళనాడు పోలీసు ఐడల్ వింగ్ దృష్టికి వచ్చింది. పార్వతి విగ్రహం అమ్మకానికి ఉందని తెలుసుకుని ఒక పురావస్తు శాస్త్రవేత్త సహాయం ఆరాధించారు. వేలంలో ఉన్న పార్వతి విగ్రహం కుంభకోణంలోని నదనపురీశ్వరార్ ఆలయానికి చెందినదని గుర్తించారు. యునెస్కో వరల్డ్ కింద భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు. ఇప్పుడు చోరీకి గురైన మిగిలిన నాలుగు విగ్రహాలు కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..