AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament: 11వ రోజుకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఇవాళ రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర సర్కార్!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారంతో 11వ రోజుకు చేరాయి. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాల వ్యతిరేకత మధ్య నాగాలాండ్‌లో కాల్పులు సహా పలు అంశాలు చర్చనీయాంశమయ్యాయి.

Parliament: 11వ రోజుకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఇవాళ రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర సర్కార్!
Parliament
Balaraju Goud
|

Updated on: Dec 13, 2021 | 11:03 AM

Share

Parliament winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారంతో 11వ రోజుకు చేరాయి. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాల వ్యతిరేకత మధ్య నాగాలాండ్‌లో కాల్పులు సహా పలు అంశాలు చర్చనీయాంశమయ్యాయి. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును ఉభయ సభల్లో తొలిరోజు ఆమోదించిన కేంద్రం, ఏడాది కాలంగా రైతులు చేస్తున్న నిరసనలకు తెరపడింది. మొదటి రెండు వారాల్లో మొత్తం ఐదు బిల్లులు సభలో ఆమోదం పొందాయి. మొదటి వారంలో రెండు బిల్లులు ఆమోదం పొందగా, రెండో వారంలో మూడు బిల్లులు ఆమోదం పొందాయి. మరోవైపు సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని గాంధీ విగ్రహం ఎదుట తమ సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటూ నిరసన కొనసాగిస్తున్నారు.

ఇదిలావుంటే, 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ అంశాన్ని ఈరోజు పార్లమెంట్‌లో లేవనెత్తుతామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే తెలిపారు. ఎంపీల సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలన్నారు. సభ్యులు అభ్యర్థనను మన్నించాలని ఖర్గే కోరుతున్నారు. ఇదిలావుంటే, సభ్యులు క్షమాపణలు చెప్పేంత వరకు తిరిగి సభలోకి అనుమతించేదీలేదని రాజ్యసభ్య ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇదివరకే స్పష్టం చేశారు. అటు లోక్‌సభలో ద్రవ్యోల్బణం అంశంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

మరోవైపు, పలు కీలక బిల్లులు ఇవాళ సభ ముందుకు రానున్నాయి. న్యాయమూర్తుల వేతనాలు మరియు సేవల సవరణ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. న్యాయమూర్తుల వేతనాలు, సేవల సవరణ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు తొలిసారి లోక్‌సభలో ఆమోదం పొందింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఈ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ లోక్‌సభలో ఎన్‌డిపిఎస్ (సవరణ) బిల్లును నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్‌సభలో నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (సవరణ) బిల్లు 2021ని ప్రవేశపెట్టనున్నారు. గత వారం దిగువ సభలో బిల్లును ప్రవేశపెట్టారు.

Read Also…  RJD MLA: చాయ్ ఇచ్చిన సిబ్బందిపై హత్యాయత్నం కేసు పెట్టిన ఎమ్మెల్యే.. అసలు విషయం తెలిస్తే షాక్!