Parliament Winter Session 2021: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. నాలుగో తేదీన 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ అంశంపై ఉభయ సభల్లోనూ దుమారం రేగుతోంది. అధికార పక్షం, విపక్షాలు తమ తమ వైఖరిపైనే నిలుస్తున్నాయి. సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతుండగా, వారి అసభ్య ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాలని అధికారపక్షం డిమాండ్ చేస్తోంది. మరోవైపు పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా శీతాకాల సమావేశాల మూడో రోజైన బుధవారం పార్లమెంట్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
12మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలనే డిమాండ్‌తో విపక్ష పార్టీలన్ని ఏకమయ్యాయి.. నల్ల బ్యాడ్జీలు ధరించి గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన దిగాయి. వారికి తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ ఎంపీలు మద్దతుల పలికారు. 4 రోజులుగా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల నిరసనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
#WATCH | Congress MP Rahul Gandhi joins the Opposition leaders’ protest against the suspension of 12 Opposition members of Rajya Sabha, in Delhi pic.twitter.com/w7Y1gSLTym
— ANI (@ANI) December 2, 2021
కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. సభ్యుల సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. అయితే, ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసేది లేదంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఇది వరకే తేల్చి చెప్పారు. మరోవైపు, విపక్షాల ఆందోళనతో రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి.
ఇక తెలంగాణలో ధాన్యం సేకరణ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ ఉభయ సభల్లోనూ వాయిదా తీర్మానమిచ్చారు టీఆర్‌ఎస్ ఎంపీలు. ఇవాళ లోక్‌సభలో ఒమిక్రాన్ వేరియంట్‌పై చర్చ జరగనుంది. రాష్ట్రీయ జనతాదళ్ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా ‘కుల ఆధారిత జనాభా లెక్కలు’ కేసులో జీరో అవర్ నోటీసు ఇచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, అధిక ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో సామాన్య ప్రజలపై పెనుభారం’పై సభలో చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ రూల్ 267 కింద ఇచ్చిన బిజినెస్ నోటీసును సస్పెండ్ చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం’ అంశంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.