రైల్వే ప్రైవేటీకరణకు కుట్ర: సోనియా మండిపాటు

రైల్వేశాఖను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. 17వ లోక్‌సభ సమావేశాల్లో తొలిసారి ప్రసంగించిన సోనియా.. రైల్వే ప్రైవేటీకరణపై మాట్లాడారు. రైల్వేను ప్రైవేటీకరిస్తే నిరుద్యోగం పెరుగుతుందని.. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ఎందుకు ప్రకటించడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రైవేటీకరణలో భాగంగా రాయ్‌ బరేలి కోచింగ్ ఫ్యాక్టరీని కార్పోరేట్ పరం చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ప్రైవేటీ కరణకు నాంది అని మండిపడ్డారు. కాగా […]

రైల్వే ప్రైవేటీకరణకు కుట్ర: సోనియా మండిపాటు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 02, 2019 | 5:10 PM

రైల్వేశాఖను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. 17వ లోక్‌సభ సమావేశాల్లో తొలిసారి ప్రసంగించిన సోనియా.. రైల్వే ప్రైవేటీకరణపై మాట్లాడారు. రైల్వేను ప్రైవేటీకరిస్తే నిరుద్యోగం పెరుగుతుందని.. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ఎందుకు ప్రకటించడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రైవేటీకరణలో భాగంగా రాయ్‌ బరేలి కోచింగ్ ఫ్యాక్టరీని కార్పోరేట్ పరం చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ప్రైవేటీ కరణకు నాంది అని మండిపడ్డారు. కాగా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ విజయం సాధించిన విషయం తెలిసిందే.