కుల్ భూషణ్‌ జాదవ్‌ను వెంటనే విడుదల చేయాలి

పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్ ‌భూషణ్‌ జాదవ్‌ను విడుదల చేసి స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను కోరింది. కుల్‌ భూషణ్ జాదవ్‌ మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టేను విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్‌లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ.. అమాయకుడైన జాదవ్‌పై పాక్ కావాలనే కేసులు పెట్టిందని, ఎలాంటి చట్టపరమైన విచారణ లేకుండానే అతడిని దోషిగా నిర్ధారించిందని ఆరోపించారు. జాదవ్‌ను తిరిగి తీసుకొచ్చేంతవరకు భారత్ […]

కుల్ భూషణ్‌ జాదవ్‌ను వెంటనే విడుదల చేయాలి

Edited By:

Updated on: Jul 18, 2019 | 7:34 PM

పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్ ‌భూషణ్‌ జాదవ్‌ను విడుదల చేసి స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను కోరింది. కుల్‌ భూషణ్ జాదవ్‌ మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టేను విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్‌లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ.. అమాయకుడైన జాదవ్‌పై పాక్ కావాలనే కేసులు పెట్టిందని, ఎలాంటి చట్టపరమైన విచారణ లేకుండానే అతడిని దోషిగా నిర్ధారించిందని ఆరోపించారు. జాదవ్‌ను తిరిగి తీసుకొచ్చేంతవరకు భారత్ తన ప్రయత్నాలు ఆపదవని.. ఏ అవకాశాన్ని తాము వదులుకోమని ఆయన అన్నారు.

అనంతరం ఈ అంశంపై ఉప రాస్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఇక ఈ కేసులో ఎలాంటి ఫీజు తీసుకోకుండా భారత్ తరఫున వాదించిన సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వేను అభినందినట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.