Rahul Gandhi: రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ ఉల్లంఘన నోటీసు ఇచ్చిన ముగ్గురు బీజేపీ ఎంపీలు

|

Feb 03, 2022 | 6:24 PM

శుక్రవారం లోక్‌సభలో ముగ్గురు బీజేపీ సభ్యులు కాంగ్రెస్‌ నాయకుడు ఎంపీ రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా ప్రత్యేక హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ ఉల్లంఘన నోటీసు ఇచ్చిన ముగ్గురు బీజేపీ ఎంపీలు
Rahul Gandhi
Follow us on

Breach of Privilege Notice to Rahul Gandhi: గురువారం లోక్‌సభ(Lok Sabha)లో ముగ్గురు బీజేపీ(BJP) సభ్యులు కాంగ్రెస్‌(Congress) నాయకుడు ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi)కి వ్యతిరేకంగా ప్రత్యేక హక్కుల ఉల్లంఘన నోటీసును సమర్పించారు. స్పీకర్ అనుమతి లేకుండా ఆందోళన సమయంలో రైతుల మృతికి సంతాపంగా మౌనం పాటించాలని సభ్యులను కోరడం సభను ధిక్కరించడమేనని అన్నారు. పార్లమెంటు బడ్జెట్ లోక్‌సభలో రాహుల్ గాంధీపై మొదట బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రివిలేజ్ ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సభలో రాహుల్ గాంధీ తప్పుడు ప్రకటనలు చేసి దేశాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ.. ధిక్కార నోటీసు ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రతిపక్షాల తరఫున బుధవారం చర్చను ప్రారంభిస్తూ.. కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను విమర్శిస్తూ.. రాహుల్‌పై బీజేపీ ఎంపీ ఈ నోటీసు పంపారు. లోక్‌సభ స్పీకర్‌కి ఇచ్చారు.

అంతకుముందు నాటకీయ పరిణామాల మధ్య రాహుల్ గాంధీ గురువారం తన పార్టీ సభ్యులతో పాటు TMC, DMKకి చెందిన ఎంపీలతో కలిసి ఆందోళనలో భాగంగా రైతుల మృతికి సంతాపంగా నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించారు. నిరసనల సందర్భంగా 200 మంది రైతులు చనిపోయారని, వారికి ప్రభుత్వం నివాళులు అర్పించకపోవడం వల్లే తాము ఇలా చేస్తున్నానని చెప్పారు. కొందరు సభ్యులు స్పీకర్ అనుమతి లేకుండానే లోక్‌సభలో మౌనంగా నిలబడి సంతాపం వ్యక్తం చేయడం ఇటీవలి చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో బీజేపీ ఎంపీలు సంజయ్ జైస్వాల్, రాకేష్ సింగ్, పీపీ చౌదరిలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నోటీసు ఇచ్చారు.

మరోవైపు, లోక్‌సభలో రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రివిలేజ్ ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. పార్లమెంట్‌లో కేంద్రం, రాష్ట్రానికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాహుల్ గాంధీ కుట్ర పన్నారని నిషికాంత్ దూబే ఆరోపించారు. భారతదేశంలో, రాష్ట్ర సరిహద్దును పార్లమెంటు నిర్ణయిస్తుంది, రాష్ట్ర సరిహద్దును నిర్ణయించే అధికారం అసెంబ్లీకి లేదు. కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడిని టార్గెట్ చేసిన దూబే, రాహుల్ గాంధీ ఆలోచన జిన్నా రెండు దేశాల సిద్ధాంతమని అన్నారు. లోక్‌సభలో ఆయన చేసిన ప్రసంగం దేశాన్ని ముక్కలు చేసే కుట్ర అని, అందుకే తనపై లోక్‌సభ స్పీకర్‌కు ప్రత్యేక హక్కు ఉల్లంఘన, తప్పుగా సూచించడంతో పాటు సభను ధిక్కరించడం వంటి వాటిపై నోటీసు ఇచ్చారు.

రాహుల్ గాంధీ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అవమానించారని, ఇది అమెరికా కాదని, భారతదేశం అని, ఇందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు కొత్తగా స్వాధీనం చేసుకున్న భూభాగాలను కలిపి దేశం ఏర్పడిందని దుబే ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని చదవాలని రాహుల్ గాంధీకి సలహా ఇస్తూ, బిజెపి ఎంపి తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్‌ను విభజించినప్పుడు, తన కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన అసెంబ్లీ వ్యతిరేకతను దాటవేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సృష్టించిందని ప్రశ్నించారు.

Read Also…  AP CM YS Jagan: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు