Parking New Rules: ఫోటో కొట్టు.. ఫ్రైజ్ మనీ పట్టు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అదిరిపోయే ఆఫర్..!

|

Jun 17, 2022 | 6:15 AM

Parking New Rules: ఇప్పటి వరకూ రోడ్డు మీద రూల్ పాటించకపోతే ట్రాఫిక్ పోలీస్ ఫోటో కొడతారు. ఆ తర్వాత కాసేపటికే ఆ వెహికల్‌కి చలానా వస్తది.

Parking New Rules: ఫోటో కొట్టు.. ఫ్రైజ్ మనీ పట్టు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అదిరిపోయే ఆఫర్..!
Nitin Gadkari
Follow us on

Parking New Rules: ఇప్పటి వరకూ రోడ్డు మీద రూల్ పాటించకపోతే ట్రాఫిక్ పోలీస్ ఫోటో కొడతారు. ఆ తర్వాత కాసేపటికే ఆ వెహికల్‌కి చలానా వస్తది. కానీ, ఈ విధానంలో సంచలన మార్పు రానుంది. మున్ముందు కేంద్రం కొత్త చట్టం తీసుకురాబోతోంది. దాని ప్రకారం.. పోలీసులే కాదు.. ఎవరైనా ఫోటో తీసి పంపొచ్చు. పైగా ఆ ఫోటో తీసి పంపిన వాళ్లకు రివార్డ్ కూడా వస్తదట.

రోడ్డు యాక్సిడెంట్లతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు.. ప్రభుత్వం ఎన్నో రూల్స్ తీసుకొచ్చింది. రూల్స్ పాటించని వారిపై ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్.. చర్యలు కూడా తీసుకుంటోంది. నేరాన్ని బట్టి ఫైన్లు, కోర్టు శిక్షలు కూడా పడుతున్నాయి. అయినా కొంత మంది వాహనదారుల తీరు మారడం లేదు. వారికి కళ్లెం వేసేందుకు కొత్త చట్టం తీసుకొచ్చే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం.

రోడ్లపై నో పార్కింగ్ ఏరియాలో వెహికల్ పార్క్ చేస్తే చాలు.. ఎవరైనా ఫోటో తీయొచ్చు. దానిని వెంటనే ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కి లేదంటే ఫోన్ నంబర్ కు వాట్సప్ పంపిస్తే.. వెహికల్ ఓనర్‌కి ఫైన్ వేయడమే కాకుండా ఆ ఫోటో పంపిన వ్యక్తికి రివార్డ్ ఇచ్చేలా కొత్త విధానాన్ని ప్లాన్ చేస్తోంది సర్కార్. రూల్ పాటించని వాహనానికి 1000 రూపాయల ఫైన్ పడితే.. ఆ ఫోటో పంపిన వ్యక్తికి 500 రూపాయల రివార్డ్ ఇవ్వనుంది. అంటే ఫైన్ అమౌంట్‌లో 50 శాతం ఫోటో తీసిన వ్యక్తికి.. మిగిలిన 50శాతం ప్రభుత్వానికి చెందుతుంది. ఈ కొత్త విధానంతో రూల్స్ బ్రేక్ చేసే వాళ్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అదే విధంగా ట్రాఫిక్ జామ్ కు ఫుల్ స్టాప్ పెట్టోచ్చన్నారు మంత్రి నితిన్ గడ్కరీ.

ఇవి కూడా చదవండి

నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వాహనాల సమస్యలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. కరెక్ట్ ప్లేస్‌లో పార్కింగ్ చేయకపోవడం.. రోడ్లను ఆక్రమించుకోవడంపై నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే కఠిన చట్టాలు అవసరమని అభిప్రాయపడ్డారాయన.