
అనేక వివాదాల మధ్య విడుదలైన పరాశక్తి తమిళ సినిమా ఆ రాష్ట్రంలో రాజకీయంగా వివాదంగా మారింది. అందులోనూ దశాబ్దాలుగా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ డీఎంకే మధ్య చిచ్చు రేపింది. 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం ప్రధాన అంశంగా తరికెక్కిన ఈ చిత్రంలో కాంగ్రెస్ పార్టీని అవమానించేలా ఈ సినిమా ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓటమిలో ఏ చిచ్చు ఫలితం ఎక్కడ తమను ఇబ్బంది పెడుతుందోనని డిఎంకె వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
తమిళనాడులో డిఎంకె కూటమిలో కాంగ్రెస్ దశాబ్దాలుగా భాగస్వామ్యంగా ఉంది.. అయితే డిఎంకె అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం డీఎంకే ఇవ్వడం లేదు.. ఎందుకని కాంగ్రెస్ కూడా ఎప్పుడు గట్టిగా అడిగినప్పుడు పరిస్థితి లేదు.. తమిళనాడులోని మరో ప్రధాన పార్టీ అన్నాడీఎంకే కూటమిలో కూడా ఇదే పరిస్థితి .
తాజాగా రాజకీయ పార్టీని స్థాపించిన నటుడు విజయ్ మాత్రం తమతో కలిసి వచ్చే కూటమి పార్టీలకు అధికార భాగస్వామ్యం కల్పిస్తామని.. మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీల్లో అధికార భాగస్వామ్యం డిమాండ్ అనేది తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ముఖ్య నేత మాణిక్యం టాగూర్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ కచ్చితంగా తమకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఉండాలని డిమాండ్ చేశారు. మా వల్ల గెలుస్తూ అధికారంలోకి వస్తున్న డీఎంకే ఎందుకు అధికార భాగస్వామి ఇవ్వడం లేదని ప్రశ్నించారు..
అయితే ఇటీవల తమిళ తమిళంలో విడుదలైన పరాశక్తి సినిమా అందులోని అంశాలు మరోసారి డిఎంకె కూటమి లోని కాంగ్రెస్ డిఎంకెమధ్య చిచ్చురేపాయి. 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక పోరాటం.. ఆనాడు దివంగత అన్నా దురై చేసిన పోరాటం ఆధారంగా సినిమా తెరకెక్కింది.. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1966లో ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.. వీళ్ళ తరబడి జరిగిన ఉద్యమం సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండడం కాంగ్రెస్ పార్టీ తమిళులను అవమానించడం బలవంతంగా హిందీ అమలు చేయాలని చూడడంతో అప్పట్లో చివరి స్థాయిలో ఉద్యమాలు జరిగాయి. వందల సంఖ్యలో ఉద్యమకారులు చనిపోయారు. పరాశక్తి సినిమాలు అప్పటి సందర్భాన్ని బట్టి తమిళుల పాలిట విలన్ గా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సన్నివేశాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీని అలాగే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని అవమానించేలా డిఎంకె సినిమాను నిర్మించిందని.. డీఎంకే కూటమిలో అధికార భాగస్వామి అడిగినందుకు ఇలా మా పార్టీని అవమానించి ఎలా సినిమాను తీశారని ఆరోపించారు. అధికార భాగస్వామి కల్పిస్తామన్న విజయ్ ప్రకటనతో డిఎంకె కోటమిలో లుకలుకలు మొదలు కాగా తాజాగా పరాశక్తి సినిమాలోని సన్నివేశాలతో విభేదాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ వివాదం రెండు పార్టీల మధ్య పొత్తు అంశంపై ఏ మేరకు ప్రభావం చూపుతో చూడాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..