Odisha: పంచాయతీ ఎన్నికల్లో చిత్రం.. కూరగాయల వ్యాపారి కొడుకు చేతిలో ఓడిపోయిన ఎమ్మెల్యే కొడుకు!

Odisha: పంచాయతీ ఎన్నికల్లో చిత్రం.. కూరగాయల వ్యాపారి కొడుకు చేతిలో ఓడిపోయిన ఎమ్మెల్యే కొడుకు!
Odisha Panchayat Elections

రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి. ఓడలు.. బండ్లవుతాయన్న సామెతా వీరికి సరిగ్గా సరిపోతుంది. మూడు సార్లు, ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి కొడుకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పరాజయం చెందారు.

Balaraju Goud

|

Mar 02, 2022 | 3:30 PM

Odisha Panchayat Elections: రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి. ఓడలు.. బండ్లవుతాయన్న సామెతా వీరికి సరిగ్గా సరిపోతుంది. మూడు సార్లు, ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి కొడుకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పరాజయం చెందారు. ఒడిశా(Odisha)కు చెందిన మాజీ కేబినెట్ మంత్రి, అధికార బిజూ జనతాదళ్ (BJD) శాసనసభ్యుని కుమారుడు పంచాయతీ ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. కూరగాయల వ్యాపారి కుమారుడు, దంతవైద్య విద్యార్థి చేతిలో అనుహ్యంగా ఓడిపోయారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలు, రాష్ట్ర మాజీ మంత్రి అంజలీ బెహెరా ఢెంకనల్ జిల్లాలోని హిందోల్ బ్లాక్ పరిధిలోని గిరిధర్ ప్రసాద్ గ్రామ పంచాయతీ నుండి పంచాయితీ సమితి సభ్యుని స్థానానికి పోటీ చేసి 826 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బెహెరా , హిందోల్ స్థానం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2009-2012 వరకు మంత్రిగా కూడా పని చేశారు. ప్రభుత్వంలో మహిళా, శిశు అభివృద్ధి, చేనేత, జౌళి, హస్తకళల మంత్రిగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను బీజేడీ నుంచి తొలగించారు. దీంతో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు.

రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజలకు సేవ చేసేందుకే పంచాయతీ సమితి సభ్యుని స్థానానికి పోటీ చేస్తున్నానని బెహరా ఎన్నికల ముందు విలేకరులతో చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నవీన్ పట్నాయక్‌కు విపరీతమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ, బాలాసోర్ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో BJD ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనంత్ దాస్ కుమారుడు బిస్వజిత్ దాస్ ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థి 88 ఓట్ల తేడాతో ఆయనపై విజయం సాధించారు. మరో BJD-మద్దతుగల అభ్యర్థి, అనంత్ బంధువు అచ్యుతానంద దాస్ కూడా బాలాసోర్ జిల్లాలోని భోగరాయ్‌లోని మహేశ్వర్ పంచాయతీ స్థానం నుండి ఎన్నికలలో ఓడిపోయారు. పూరీ జిల్లా ప్రతాప్ పురుషోత్తంపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి హీరా నాయక్ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన నాలుగు ఓట్ల స్వల్ప తేడాతో పంచాయతీ సమితి సభ్యునిగా గెలుపొందారు.

ఎన్నికల్లో పోటీ చేయడానికి గల కారణం తన తండ్రి దినసరి కూలీ అని, శిథిలావస్థలో ఉన్న గుడిసెలో కుటుంబం జీవిస్తున్నదని హీరా చెప్పారు. ఆర్థిక అవరోధాలు, ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ చదువును కొనసాగించి ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మూడో సంవత్సరం చదువుతున్నారు. ‘ఫణి’ తుపానులో మా గ్రామస్తులు ఎంత నష్టపోయారో, స్థానిక పంచాయతీ సభ్యులు ఎలా స్పందించారో చూశాను’’ అని హీరా చెప్పారు. ఒకరు కూడా సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని హీరా తెలిపారు.

అదేవిధంగా రాయగడ జిల్లా రామన్నగూడ మండలం-1 నుంచి జిల్లా పరిషత్ సభ్యునిగా జరిగిన ఎన్నికల్లో కూరగాయల వ్యాపారి టి.శ్రీధర్ గెలుపొందారు. కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన శ్రీధర్ మాట్లాడుతూ.. ‘ప్రజలు నాపై నమ్మకం ఉంచారని, అందుకే ప్రత్యర్థి పార్టీల నుంచి డబ్బును తిప్పికొట్టి ఓట్లు వేశారన్నారు. నేను వారిని నిరాశపరచను. వృత్తిరీత్యా దంతవైద్యురాలు, మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే భజ్బల్ మాఝీ కుమార్తె లిపికా మాఝీ నబరంగ్‌పూర్ జిల్లాలోని పాపదహండి జిల్లా పరిషత్ జోన్-II నుండి గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేశారు.

Read Also…. PM Narendra Modi: స్టార్టప్ రంగానికి అండగా నిలుస్తాం.. సాంకేతికతకు పెద్దపీట వేస్తాం.. త్వరలో 5జీ స్పెక్ట్రమ్ వేలం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu