Pakistan Prisons: పాకిస్థాన్ జైళ్లలో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే.. ?

పాకిస్థాన్ జైళ్లలో చాలామంది భారతీయులు ఇప్పటికీ మగ్గిపోతున్నారు. ప్రస్తుతం ఆ దేశంలోని జైళ్లలో మొత్తం 308 మంది భారతీయులు ఉన్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం భారత హై కమిషన్‌కు వెల్లడించింది. అయితే వీళ్లలో దాదాపు 266 మంది మత్స్యకారులు ఉన్నారని తెలిపింది.

Pakistan Prisons: పాకిస్థాన్ జైళ్లలో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే.. ?
Jail
Follow us
Aravind B

|

Updated on: Jul 03, 2023 | 10:41 AM

పాకిస్థాన్ జైళ్లలో చాలామంది భారతీయులు ఇప్పటికీ మగ్గిపోతున్నారు. ప్రస్తుతం ఆ దేశంలోని జైళ్లలో మొత్తం 308 మంది భారతీయులు ఉన్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం భారత హై కమిషన్‌కు వెల్లడించింది. అయితే వీళ్లలో దాదాపు 266 మంది మత్స్యకారులు ఉన్నారని తెలిపింది. అలాగే 42 మంది పౌరులు ఉన్నట్లు నివేదించింది. ద్వైపాక్షిక ఒప్పంద విషయంలో భాగంగా ఈ వివరాలను భారత హైకమషన్‌కు ఈ సమాచారం తెలియజేశామని పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.అయితే ఇప్పటికే శిక్షను పూర్తి చేసుకున్న 254 మంది మత్య్సకారులు అలాగే నలుగురు పౌరులను కూడా వెంటనే జైళ్ల నుంచి విడుదల చేయాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను కోరింది.

మరో విషయం ఏంటంటే భారత్ జైళ్లలో ఉంటున్న పాకిస్థాన్ ఖైదీల వివరాలను కూడా ఢిల్లీలోని పాక్ హైకమీషన్‌కు విదేశీ వ్యవహారాల శాఖ నివేదికను వెల్లడించింది. ఈ జాబిత ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఉన్న జైళ్లలో 417 పాకిస్థానీయులు ఉన్నారు. వీళ్లలో 343 మంది పౌరులు ఉండగా.. మిగిలిన 74 మంది మత్స్యకారులు ఉన్నారు. అలాగే ఇండియాలో శిక్షను పూర్తి చేసుకున్న తమ దేశ ఖైదీలను కూడా విడుదల చేయాలని పాకిస్థాన్ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా భారత్, పాకిస్థాన్‌ దేశాల్లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వివరాల జాబితాను అందించుకునే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం రెండు దేశాలు ప్రతి సంవత్సరం జనవరి 1న అలాగే జులై 1న పరస్పర సమాచారాలు అందించుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!