భారత్‌పై పాక్ భారీ కుట్ర! యుద్ధం చేతకాక.. సైబర్ ఎటాక్‌తో
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్థాన్ ప్రేరేపించిన హ్యాకర్లు భారతీయ వెబ్‌సైట్లను లక్ష్యం గా చేసుకుని సైబర్ దాడులు చేస్తున్నారు. 'HOAX 1337', 'నేషనల్ సైబర్ క్రూ' వంటి గ్రూపులు సైనిక, ప్రభుత్వ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకున్నాయి.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనేలా పరిస్థితులు ఉన్నాయి. అయితే.. ఇండియాతో యుద్ధం చేస్తే కచ్చితంగా ఓడిపోతామని భావిస్తున్న పాక్.. దొంగదారిలో ఇండియాను దెబ్బ తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఇండియన్ వెబ్‌సైట్స్‌ను హ్యాక్ చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు ప్రయత్నించినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాకర్ గ్రూపులు కీలకమైన భారతీయ వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను భారత సైబర్ భద్రతా సంస్థలు అడ్డుకున్నాయి. ‘సైబర్ గ్రూప్ HOAX1337′,’నేషనల్ సైబర్ క్రూ’ వంటి గ్రూపులు సైబర్ దాడుల వెనుక ఉన్నాయి. ఇవి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వెబ్‌సైట్‌లు, సైనిక అనుభవజ్ఞుల కోసం హెల్త్‌కేర్ పోర్టల్‌తో సహా సున్నితమైన ప్లాట్‌ఫామ్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ సైబర్ దాడులతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
