Shivraj Sing Chouhan: అది మళ్లీ రిపీట్ అయ్యిందో.. పాకిస్తాన్‌కు కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ స్ట్రాంగ్‌ వార్నింగ్!

పాకిస్తాన్‌కు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరో సారి కవ్వింపు చర్యలకు పాల్పడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ తన ఉనికిని కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఆమెరికా ఆద్వర్యంలో రెండు దేశాల మధ్య కాల్పుల విమరణ ఒప్పందం జరిగిన తర్వాత దాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించిన నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Shivraj Sing Chouhan: అది మళ్లీ రిపీట్ అయ్యిందో.. పాకిస్తాన్‌కు కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ స్ట్రాంగ్‌ వార్నింగ్!
Shivraj Sing Chouhan

Updated on: May 13, 2025 | 10:59 PM

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం అంబికాపుర్‌లో ఏర్పాటు చేసిన ‘మోర్‌ ఆవాస్‌ మోర్‌ అధికార్‌’ కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరో సారి కవ్వింపు చర్యలకు పాల్పడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ తన ఉనికిని కోల్పోవాల్సి వస్తుందని పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.

భారత్‌కు ఎవరితోనూ కొట్లాడే ఉద్దేశం లేదని.. కానీ తమ జోలికి వస్తే మాత్రం ఎంతటివారిపైనా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ అన్నారు. ‘ఆపరేషన్ సిందూర్‌తో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం అని అన్నారు. పహల్గామ్‌లో మన ఆడబిడ్డల సిందూరం తుడిచిన ఉగ్రమూకలను వారి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేయడం దేశ శౌర్యానికి నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు.

భారత్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని సహించదని..ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని అంతంమొందించే విషయంలో భారత సైనిక బలగాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని కేంద్రమంత్రి తెలిపారు. ప్రభుత్వం ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతోనే పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నిన భారత్ సైన్యం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..