ఆ దేశం మారదంతే ! మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన ! జమ్మూలో జేసీబీ యంత్రంపై పాక్ రేంజర్ల ఫైరింగ్

| Edited By: Anil kumar poka

Jun 02, 2021 | 2:52 PM

జమ్మూ కాశ్మీర్ లోని ఆర్నియా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం ఉదయం భారత జవాన్లు నడుపుతున్న జేసీబీ యంత్రంపై పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఆ ప్రాంతంలోని పొదలను తొలగిస్తూ..

ఆ దేశం మారదంతే ! మళ్ళీ కాల్పుల విరమణ  ఒప్పంద ఉల్లంఘన ! జమ్మూలో జేసీబీ  యంత్రంపై  పాక్ రేంజర్ల ఫైరింగ్
Pakistan Rangers Fired At Earthmover Machine In Jammu
Follow us on

జమ్మూ కాశ్మీర్ లోని ఆర్నియా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం ఉదయం భారత జవాన్లు నడుపుతున్న జేసీబీ యంత్రంపై పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఆ ప్రాంతంలోని పొదలను తొలగిస్తూ.. భూమిని చదును చేస్తుండగా అది చూసిన వారు..కాల్పులు జరిపినట్టు తెలిసింది. అయితే జేసీబీ బుల్లెట్ ప్రూఫ్ కావడంతో అది దెబ్బ తినలేదని తెలియవచ్చింది. వెంటనే భారత జవాన్లు కూడా కొన్నిరౌండ్లు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. కొద్దిసేపటికి అక్కడ సాధారణ పరిస్థితి నెలకొంది. ఇలా ఉండగా ఈ సెక్టార్ లో గస్తీ తిరుగుతున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ ఘటనను ధృవీకరించ లేదు..తోసిపుచ్చనూ లేదు. కాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది రెండో సారి.గత మే 2 న సాంబా జిల్లాలోని రామ్ గడ్ సెక్టార్లో పాకిస్థాన్ దళాలు కాల్పులకు దిగాయి. ఉభయ దేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా చూడాలని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని లోగడ ఫిబ్రవరి 25 న రెండు దేశాల సైనికాధికారులు హాట్ లైన్ ద్వారా జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చారు. నాడు ఆ చర్చల పర్యవసానాన్ని ఇండియా అతి ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించింది. ఇక భారత-పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి, సుస్థిరత కొనసాగుతుందని పేర్కొంది. కానీ ఆ పొరుగు దేశం తన బుద్ధి మార్చుకోదని తాజా ఘటన ద్వారా నిరూపితమవుతోందంటున్నారు.

బుధవారం నాటి సంఘటనలో పాకిస్థాన్ తాము యధాప్రకారం భారత శిబిరాలపై ఫైరింగ్ జరుపుతూనే ఉంటామని తెలియజేయడానికే కావాలని జేసీబీపై కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : బ్రేక్ లు ఫెయిల్ అయ్యిన లారీ ని ఎంతో నైపుణ్యంగా 3 కి.మీ రివర్స్ లో డ్రైవింగ్.. వైరల్ అవుతున్న వీడియో,ఫిదా అవుతున్న నెటిజెన్లు : Viral Video

Viral Video: ఎలుకకు జోలపాట పడుతున్న మూడేళ్ళ పాప..వైరల్ అవుతున్న వీడియో.

ఆస్ట్రేలియాలో వ్యవసాయ భూములపై ఎలుకల దాడి..భారత్ మందు కోసం ఎన్ ఎస్ డబ్ల్యు ఎదురుచూపులు: vial video