బాబ్బాబు.. గొడవలొద్దు మాట్లాడుకుందాం ప్లీజ్‌! పాకిస్థాన్‌ ప్రధాని నోటి నుంచి శాంతి చర్చల మాట

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, భారత్‌తో చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ప్రతిపాదించారు. తాజా సరిహద్దు సంఘర్షణ తర్వాత ఈ ప్రతిపాదన వచ్చింది. షరీఫ్ శాంతి కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కశ్మీర్ సమస్య కూడా చర్చల్లో అంశంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

బాబ్బాబు.. గొడవలొద్దు మాట్లాడుకుందాం ప్లీజ్‌! పాకిస్థాన్‌ ప్రధాని నోటి నుంచి శాంతి చర్చల మాట
Pakistan Pm Shehbaz Sharif

Updated on: May 16, 2025 | 10:53 AM

భారత్‌తో ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి పాకిస్థాన్‌ ప్రధాని కాళ్లబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. పాక్‌ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇండియాతో చర్చలకు ప్రతిపాదన చేశారు. పాకిస్తాన్ “శాంతి కోసం” చర్చల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని అన్నారు. దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ఇటీవల జరిగిన సైనిక ఘర్షణలో పాల్గొన్న అధికారులు, సైనికులతో ఆయన సంభాషించారు. “శాంతి కోసం భారత్‌తో మాట్లాడటానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని ఆయన అన్నారు. అంతేకాకుండా “శాంతి కోసం షరతులలో” కశ్మీర్ సమస్య కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

అయితే జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం దానిలో అంతర్భాగంగా, విడదీయరాని భాగాలుగా ఉంటాయి అని భారత్‌ వాదించింది. షెహబాజ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఎయిర్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ వైమానిక స్థావరానికి వచ్చారు. నాలుగు రోజుల పాటు జరిగిన తీవ్రమైన సరిహద్దు డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత మే 10న భారత్‌, పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘర్షణను ముగించడానికి రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం తర్వాత పాక్‌ ప్రధాని రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండవసారి.

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మృతికి ప్రతీకారం తీర్చుకోవడానికి మే 6, 7 తేదీల మధ్య రాత్రి భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. ఆ తర్వాత మే 8, 9, 10 తేదీల్లో పాకిస్తాన్ అనేక భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే భారత సాయుధ దళాలు రఫీకి, మురిద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్‌లతో సహా అనేక పాకిస్తాన్ సైనిక స్థావరాలపై తీవ్రమైన ఎదురుదాడిని ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ అమెరికా మధ్యవర్తిత్వం కోరింది. దాంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.