బిగ్‌ బ్రేకింగ్‌: పాక్‌ దుస్సాహసం.. జమ్మూ ఎయిర్‌ పోర్ట్‌పై రాకెట్‌ దాడి! నగరం మొత్తం బ్లాక్‌ అవుట్‌

పాకిస్తాన్ జమ్మూ ఎయిర్ పోర్టుపై రాకెట్ దాడి చేసింది. భారత సైన్యం పాకిస్తాన్ నుండి వచ్చే డ్రోన్లను ఛేదించింది. జమ్మూ నగరంలో బ్లాక్ అవుట్ ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ దాడికి దిగడం గమనార్హం. భారత సైన్యం ప్రత్యుత్తరం ఇస్తుంది. రాకెట్ దాడికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

బిగ్‌ బ్రేకింగ్‌: పాక్‌ దుస్సాహసం.. జమ్మూ ఎయిర్‌ పోర్ట్‌పై రాకెట్‌ దాడి! నగరం మొత్తం బ్లాక్‌ అవుట్‌
Jammu Airport

Updated on: May 08, 2025 | 8:54 PM

పాకిస్థాన్‌ మరోసారి భారత్‌పై దాడికి తెగబడింది. జమ్మూ ఎయిర్‌ పోర్ట్‌పై రాకెట్‌ దాడి చేసినట్లు సమాచారం. ఇప్పటికే జమ్మూ నగరం అంతా బ్లాక్‌ అవుట్‌ ప్రకటించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలిన సైన్యం సైరన్‌ మోగించింది. పాకిస్థాన్‌ నుంచి వస్తున్న డ్రోన్లను భారత సైన్యం పేల్చేసింది. భారత్‌ చేసిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌ పిచ్చిగా ఎదురుదాడికి దిగుతోంది. ఎప్పటికప్పుడు భారత సైన్యం పాక్‌ దాడిని తిప్పి కొడుతోంది. అయితే.. జమ్మూ ఎయిర్‌ పోర్ట్‌పై రాకెట్‌ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..