పూంచ్‌లో ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టుల దాడి, ఐదుగురు సైనికులు మృతి, బాధ్యత వహించిన PFF

|

Dec 22, 2023 | 8:55 AM

బుధవారం రాత్రి నుంచి ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. ఈ క్రమంలోనే రెండు వాహనాల్లో జవాన్లు ఆ ప్రదేశానికి బయల్దేరారు. రాజౌరీ- ఠాణామండీ- సురన్‌కోటే రహదారిపై ఆర్మీ వాహనాలు వెళ్తున్నాయి. సావ్ని ప్రాంతానికి ఆ వాహనాలు చేరుకోగానే.. ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు  జవాన్లు అమరులయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అదనపు బలగాలు.. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించారు.

పూంచ్‌లో ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టుల దాడి, ఐదుగురు సైనికులు మృతి, బాధ్యత వహించిన PFF
Pak Terrorist Attack
Follow us on

భద్రతాబలగాలే లక్ష్యంగా జమ్మూ- కశ్మీర్‌‌లో ఉగ్రవాదులు తెగబడ్డారు. టెర్రరిస్టుల దాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో సాయుధ ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు. జవాన్లు ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులవ్వగా.. మరో మరి కొంత మంది తీవ్ర విషాదాన్ని నింపింది. ఫూంచ్ జిల్లాలోని ఆర్మ్‌డ్ పోలీస్ యూనిట్‌ సమీపంలో బుధవారం రాత్రి పేలుళ్లు సంభ‌వించాయి. వాహ‌నాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడ ఉగ్రవాదులు ఉన్నార‌న్న స‌మాచారం మేర‌కు ఆప‌రేష‌న్ భద్రతా దళాలు అలెర్ట్ అయ్యాయి.

బుధవారం రాత్రి నుంచి ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. ఈ క్రమంలోనే రెండు వాహనాల్లో జవాన్లు ఆ ప్రదేశానికి బయల్దేరారు. రాజౌరీ- ఠాణామండీ- సురన్‌కోటే రహదారిపై ఆర్మీ వాహనాలు వెళ్తున్నాయి. సావ్ని ప్రాంతానికి ఆ వాహనాలు చేరుకోగానే.. ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు  జవాన్లు అమరులయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అదనపు బలగాలు.. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించారు.

గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారడంతో సైన్యం పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తోంది. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై రెండోసారి ఉగ్రదాడి జరిగింది. దీంతో భద్రతా దళాలు అలెర్ట్ అయ్యాయి. రాజోరిలోని థానామండి ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో రెండు రోజుల నుంచి ఆర్మీ కూంబింగ్‌ కొనసాగిస్తోంది. వీరమరణం పొందిన ఇద్దరు సైనికుల మృతదేహాలు ఛిద్రమైనట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు గులాం నబీ ఆజాద్, మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు.

ఇవి కూడా చదవండి

పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF), పాకిస్తాన్‌లో ఉన్న లష్కరే తోయిబా (LeT) శాఖ ఉగ్రవాద దాడికి బాధ్యత వహించింది. జమ్మూలోని రక్షణ శాఖ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్త్వాల్ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల గురించి నిఘా వర్గాల సమాచారం అందుకుని పూంచ్ జిల్లాలోని ధేరా కి గాలీ ప్రాంతంలో ఆర్మీ కూంబింగ్‌ నిర్వహించబడింది. ఉగ్రవాదులు రెండు వాహనాలపై (ఒక ట్రక్కు, జిప్సీ) కాల్పులు జరిపినప్పుడు ఈ సైనికులు సంఘటన స్థలం వైపు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

కొన్ని వారాల క్రితం కూడా దాడి జరిగింది

దాడికి గురైన సైనికుల ఆయుధాలను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతుండగా అధికారులు మరింత సమాచారం సేకరించి ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడికి కొద్ది వారాల ముందు సమీపంలోని రాజౌరి జిల్లాలోని బజిమల్ అటవీ ప్రాంతంలోని ధర్మసల్ బెల్ట్‌లో కాల్పుల్లో ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది వీరమరణం పొందారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 19 మంది భద్రతా సిబ్బంది వీర మరణం

మేలో యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్ సమయంలో చమ్రేర్ అడవిలో మరో ఐదుగురు ఆర్మీ సైనికులు వీరమరణం పొందారు. ఒక మేజర్ ర్యాంక్ అధికారి గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఓ విదేశీ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. రాజౌరీ, పూంచ్ , రియాసి జిల్లాల్లో ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు 19 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్లలో మొత్తం 54 మంది చనిపోయారు. అంతకుముందు అక్టోబర్ 2021లో అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన రెండు వేర్వేరు దాడుల్లో తొమ్మిది మంది సైనికులు వీరమరణం పొందారు. అక్టోబర్ 11న, ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO)తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది చామ్రేర్‌లో వీరమరణం పొందగా, అక్టోబర్ 14న, ఒక JCO , ముగ్గురు సైనికులు సమీపంలోని అడవిలో ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..