Pahalgam Terrorist Attack: క్షణ క్షణం భయం భయం.. వణికిపోతున్న పాకిస్తాన్.. పీఓకేలోని ఉగ్ర శిబిరాలు ఖాళీ..!

ఉగ్రవాదులు లేరంటూ పాక్ బుకాయిస్తూనే.. వారికి షెల్టర్ ఇస్తూ సేఫ్ జోన్‌కు తరలిస్తోంది. ఇండియా దాడి చేస్తుందన్న ఉద్దేశంతో.. పీఓకేలో ఉగ్ర శిబిరాలు ఖాళీ చేయిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ ధీటైన సమాధానం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Pahalgam Terrorist Attack: క్షణ క్షణం భయం భయం.. వణికిపోతున్న పాకిస్తాన్.. పీఓకేలోని ఉగ్ర శిబిరాలు ఖాళీ..!
Pm Modi

Updated on: Apr 29, 2025 | 8:29 AM

పహల్గాం ఉగ్రదాడితో భారత్- పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ ధీటైన సమాధానం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. దేనికైనా సిద్ధం, యుద్ధానికి రెడీ అంటూ పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నా.. పాకిస్థాన్ లోలోపల వణికిపోతుంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నామని ఆధారాలతో తెలిస్తే.. అంతర్జాతీయంగా పాక్‌ ఒంటరి అవుతుందని తెలిసి ముందస్తు చర్యలు ప్రారంభించింది. పీవోకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను పాకిస్థాన్‌ సైన్యం ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వారిని ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటామనే భయంతో.. పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) అంతటా అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ఖాళీ చేయడం ప్రారంభించిందని నిఘా వర్గాలు సోమవారం వెల్లడించాయి.. భారత దాడులను నివారించడానికి ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, భూగర్భ బంకర్లలోకి మారుస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి..

పీఓకే ప్రాంతం అంతటా చాలా లాంచ్ ప్యాడ్‌లు ఉన్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించిన కొంతసేపటికే.. పాకిస్తాన్ ఈ చర్య తీసుకుంది.. కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుటా, కోట్లి, ఖుయిరట్టా, మంధర్, నికైల్, చమన్‌కోట్, జంకోట్ నుండి ఉగ్రవాదులను తరలించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి..

ఈ లాంచ్ ప్యాడ్‌లు చాలా కాలంగా ఉగ్రవాదులను నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) దాటి జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేవేశించడానికి..అలాగే.. ఉగ్రవాదులను సమీకరించే కీలక కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. భారత నిఘా, ముందస్తు చర్యల నుంచి తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కాపాడుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎల్‌ఓసి వెంబడి ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి.. ఈ ఉగ్రదాడిలో 26 మంది మరణించారు.

గత వారం, భారత భద్రతా దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా పనిచేస్తున్న కనీసం 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలపై నిఘా పెట్టాయి. నిఘా నివేదికల ప్రకారం, 150 నుండి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ప్రస్తుతం వివిధ శిబిరాల్లో ఉండి, చొరబాటు ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ (HM), జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కరే-ఎ-తోయిబా (LeT) నుండి దాదాపు 60 మంది విదేశీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లో చురుగ్గా ఉన్నారని, 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు నివేదించాయి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..