
పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తానీయులను దేశం విడిచి వెళ్ళమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇంతలో, ఒక CRPF జవాను కథ వెలుగులోకి వచ్చింది. ఆ సైనికుడు ఒక పాకిస్తానీ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీని తరువాత, ఇప్పుడు ఈ ప్రేమకథ కారణంగా అతను తన ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని దాచిపెట్టిన జవాన్‌ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో అతన్ని శనివారం(మే 03) విధుల నుండి తొలగించారు.
ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత, CRPF జవాన్ మునీర్ అహ్మద్ కీలక విషయాన్ని బయటపెట్టాడు. మునీర్ CRPF 41వ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ఉద్యోగం నుంచి తొలగించిన కొన్ని గంటల తర్వాత, మునీర్ అహ్మద్ మాట్లాడుతూ, గత సంవత్సరం తాను వివాహం చేసుకున్నానని, అంటే ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ నుండి అనుమతి పొందిన ఒక నెల తర్వాత పెళ్లి జరిగినట్లు చెప్పాడు. అతను పాకిస్తానీ మహిళతో తన వివాహాన్ని దాచిపెట్టాడని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు, అతను వివాహం చేసుకోవడానికి ప్రధాన కార్యాలయం నుండి అనుమతి కోరానని, అనుమతి పొందిన ఒక నెల తర్వాత వివాహం చేసుకున్నానని చెప్పడం సంచలనంగా మారింది.
జమ్మూలోని ఘరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్ 2017 ఏప్రిల్‌లో CRPFలో చేరారు. ఉద్యోగం నుండి తన తొలగింపు గురించి మాట్లాడుతూ, తన తొలగింపును కోర్టులో సవాలు చేస్తానని చెప్పారు. కోర్టు నుండి తనకు న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..