Oxygen Supply: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఒక వైపు కరోనా మరణాలు సంభవిస్తుంటే.. మరో వైపు ఆక్సిజన్ కొరతో మరిన్ని మరణాలు సంభవిస్తున్నాయి. దీని కారణంగా మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా తమిళనాడులోని చెంగల్‌పట్టులో విషాదం చోటు చేసుకుంది. చెంగల్‌పట్టుని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. అయితే ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడ లోపం జరిగిందో తెలియాల్సి ఉంది.
అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కరోనా బాధితులు మృతి చెందినట్లు వారి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇలా ఆక్సిజన్ అందక చాలా మంది రోగులు మృత్యువాత పడుతున్నారు. ముందే దేశంలో కరోనా మహహ్మారి బారిన పడి ప్రాణాల్పోతుంటే ఇలా ఆక్సిజన్ అందక ఇబ్బందులకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా దేశంలో కరోనాతో, ఆక్సిజన్ అందక మరణమృదంగం మొగిస్తోంది. రోజురోజుకు ఆక్సిజన్ అందక మృతి చెందే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటి చాలా రాష్ట్రాల్లో కరోనా రోగులకు సరైన ఆక్సిజన్ అందక మృతి చెందారు.
అయితే తమిళనాడే కాకుండా మంగళవారం కార్ణటకలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది ప్రాణాలు కోల్పోయారు. చామరాజనగర్ జిల్లా ఆస్పత్రిలో ఈ విషాదం చోటు చేసుకుంది. వైద్యులు మాత్రం ఆక్సిజన్ కొరతతో 12 మంది చనిపోయారని.. మిగతా రోగులు ఇతర అనారోగ్య కారణాలతో మరణించారని చెబుతున్నారు. అలాగే ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
ఇవీ చదవండి: