Oxygen Demand: బెంగాల్‌కు ప్రాణవాయువు, ఔషధాలు సరఫరా చేయండి.. పీఎం మోదీకి మమతా లేఖ.. 

Mamata Banerjee To PM Narendra Modi: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో విపత్కర

Oxygen Demand: బెంగాల్‌కు ప్రాణవాయువు, ఔషధాలు సరఫరా చేయండి.. పీఎం మోదీకి మమతా లేఖ.. 
Mamata Banerjee To PM Narendra Modi

Updated on: May 07, 2021 | 5:34 PM

Mamata Banerjee To PM Narendra Modi: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  లేఖ రాశారు. బెంగాల్‌లో కోవిడ్ ఉధృతిని వివరిస్తూ.. వ్యాక్సిన్లు, రెమిడేసివిర్, ఆక్సిజన్, ఔషధాలు కావాలంటూ ఆమె కోరారు. వీలైనంత తొందరగా వీటిని తమ రాష్ట్రానికి పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కరోనా చికిత్సలో ఆక్సిజన్ వినియోగానికి అత్యధిక డిమాండ్ ఏర్పడుతున్న ఈ నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాశారు. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, అవసరాలకు తగినంత ప్రాణవాయువు సరఫరా చేయాలని ప్రధానికి మమతా విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్లో పరిస్థితి చేయిదాటకముందే.. చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ నెల 5వ తేదీన రాసిన లేఖలో కూడా రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కోసం డిమాండ్ మరింత పెరిగిన అంశాన్ని ప్రస్తావించానని.. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ.. ఆక్సిజన్ మాత్రం చాలడంలేదని మమతా పేర్కొన్నారు. గత 24 గంటల వ్యవధిలో బెంగాల్లో 470 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఉపయోగించారు. రాబోయే ఏడెనిమిది రోజుల్లో అది 550 మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని భావిస్తున్నామంటూ మమత వెల్లడించారు. ఇదే అంశాన్ని తమ చీఫ్ సెక్రటరీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

కానీ కేంద్రం మాత్రం పశ్చిమ బెంగాల్  ను పట్టించుకోవడం లేదని… ఇతర రాష్ట్రాలకు మాత్రం అత్యధికంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. నరేంద్ర మోదీ ఇకనైనా స్పందించి బెంగాల్ కు రోజుకు 550 మెట్రిక్ టన్నులు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని మమత తన లేఖలో డిమాండ్ చేశారు.

ఇదిలాఉంటే.. బెంగాల్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, బ్యూటీ పార్లర్లు, సినిమా థియేటర్లు, క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు, రెస్టారెంట్లు, బార్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌‌ను మూసివేశారు. కాగా.. నిన్న బెంగాల్‌‌లో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

 

Also Read:

YS Jagan: ప్రధాని మోదీకి సపోర్ట్‌గా జగన్ ట్వీట్.. జార్ఖండ్ సీఎంకు కౌంటర్.. అసలేం జరిగిందంటే..?

డబ్ల్యూటీసీ ఫైనల్‌: కోహ్లీ స్నేహితుడికి చోటు దక్కే అవకాశాలు తక్కువ.! ఆ ఆటగాడు ఎవరో తెలుసా.!!