బెంగళూరు ఘర్షణలపై స్పందించిన ఓవైసీ

| Edited By:

Aug 12, 2020 | 5:44 PM

కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకున్న ఘర్షణలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఘటనను ఖండిస్తూ పోస్ట్ చేశారు. బెంగళూరులో హింసకు సంబంధించిన..

బెంగళూరు ఘర్షణలపై స్పందించిన ఓవైసీ
Follow us on

కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకున్న ఘర్షణలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఘటనను ఖండిస్తూ పోస్ట్ చేశారు. బెంగళూరులో హింసకు సంబంధించిన ఘటనను ఖఃడిస్తున్నానని.. సోషల్ మీడియాలో పోస్ట్ ఖండించదగినదంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఘటనను ఉద్దేశించి హింసకు పాల్పడడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన విషయంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు అంతా సంయమనం పాటించాలని కోరారు.

కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి మేనల్లుడు సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుపై మంగళవారం రాత్రి బెంగళూరులో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 60 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతో వెంటనే పోలీసులు కాల్పులకు పాల్పడటంతో.. ఇద్దరు మరణించారు. పోలీసులపై దాడికి దిగిన ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అదే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడిని కూడా అరెస్ట్ చేశారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే