Medical Posts: దేశంలోని మెడికల్ కాలేజీల కోసం ఎన్ని పోస్టులు మంజూరయ్యాయో తెల్సా…

|

Dec 07, 2024 | 12:36 PM

దేశం, రాష్ట్రం, యుటి వారీగా వైద్య కళాశాలల కోసం రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను తెలిపాలని సభ్యుడు బిష్ణు పద రే కోరడంతో.. లోక్ సభలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రిప్లై ఇచ్చింది.

Medical Posts: దేశంలోని మెడికల్ కాలేజీల కోసం ఎన్ని పోస్టులు మంజూరయ్యాయో తెల్సా...
Medical Staff
Follow us on

దేశంలోని మెడికల్ కాలేజీల కోసం మొత్తం 90,794 పోస్టులు మంజూరయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం లోక్‌సభకు తెలిపింది. దేశం, రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా వైద్య కళాశాలల కోసం క్రియేట్ చేసిన పోస్టుల వివరాలను తెలపాలని మంత్రిత్వ శాఖను కోరడంతో.. ఈ మేరకు రిప్లై వచ్చింది.  వైద్య కళాశాలలకు సంబంధించిన డేటాను రాష్ట్ర ప్రభుత్వాలు పొందుపరుస్తాయని, కేంద్రం మెయింటైన్ లేదని సంబంధిత మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో మంజూరైన పోస్టుల వివరాలను మంత్రిత్వ శాఖ పంచుకుంది.

సర్. నం. మెడికల్ కాలేజీ/ఇన్‌స్టిట్యూట్‌లు మంజూరైన పోస్టుల సంఖ్య
1 ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూఢిల్లీ 14,179
2 ప్రధాన మంత్రి స్వాస్త్య సురక్ష యోజన (PMSSY) కింద 22 కొత్త AIIMS 46,182
3 పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగడ్ (PGIMER) 9,545
4 జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుదుచ్చేరి (జిప్‌మర్) 5,700
5 వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ (VMMC), న్యూఢిల్లీ (సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌తో అనుబంధం) 7,436
6 లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ (LHMC), న్యూఢిల్లీ 3,659
7 అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ABVIMS), న్యూఢిల్లీ (డా. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌తో అనుబంధం) 181
8 నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & మెడికల్ సైన్సెస్ (NEIGRIHMS), షిల్లాంగ్ 1,979
9 రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS), ఇంఫాల్ 1,933

మెడికల్ కాలేజీ రిక్రూట్‌మెంట్ నిబంధనలను రూపొందించడం, సవరించడం అనేది సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లు చేపట్టే కాలానుగుణ ప్రక్రియ అని కేంద్రం పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసవ ఇక్కడ క్లిక్ చేయండి..