Watch Video: వీడు మామూలోడు కాదు.. బ్యాగుతో టిప్ టాప్‌గా ఫ్లైట్‌ దిగాడు.. అనుమానం వచ్చి చెక్‌ చేయగా..

|

Oct 31, 2022 | 8:50 PM

ఎంత నిఘా పెట్టినా.. స్మగ్లర్స్‌ తీరు మాత్రం మారడం లేదు. గోల్డ్‌, డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తూ.. నిఘా కళ్లకు దొరికిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి.

Watch Video: వీడు మామూలోడు కాదు.. బ్యాగుతో టిప్ టాప్‌గా ఫ్లైట్‌ దిగాడు.. అనుమానం వచ్చి చెక్‌ చేయగా..
Delhi Airport
Follow us on

ఎంత నిఘా పెట్టినా.. స్మగ్లర్స్‌ తీరు మాత్రం మారడం లేదు. గోల్డ్‌, డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తూ.. నిఘా కళ్లకు దొరికిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 70కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఓ విదేశీ ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌లో అడుగున సీక్రెట్‌గా దాచి పెట్టిన 9కిలోలకు పైగా హెరాయిన్‌ను సీజ్‌ చేశారు. కరేబియన్‌ దేశమైన బెలిజ్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు జోహన్నస్‌ బర్గ్‌ నుంచి దోహా మీదుగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడని అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు అతనిపై అనుమానంతో బ్యాగ్‌ను తనిఖీ చేశారు. పైకి సాధారణ ట్రావెల్‌ బ్యాగ్‌లా కనిపించేలా ఉన్నా.. అందులో రహస్యంగా ప్రత్యేక అర ఏర్పాటుచేసి మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ట్రాలీ బ్యాగ్‌లో అడుగున హెరాయిన్‌ను దాచి సీక్రెట్‌గా కస్టమర్లకు చేరుద్దామనుకున్న అతని ప్లాన్‌ బెడిసికొట్టింది. అధికారుల కళ్లుగప్పడం కోసం నిందితుడు తెలివిగా సూట్‌కేసులోని రహస్య పొరలో హెరాయిన్‌ను సీల్‌ చేశాడు. అయినా కస్టమ్స్‌ అధికారులు దాన్ని కనిపెట్టి నిందితుడి ఆటకట్టించారు.

నిందితుడి నుంచి 9 కిలోలకు పైగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని.. దీని విలువ మార్కెట్లో రూ.69.95 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా.. ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ లభించడం.. ప్రస్తుతం కలకలం రేపింది. అయితే.. నిందితుడు ఎలా తీసుకువచ్చాడు.. దీనికి వెనుక ఎవరి హస్తం ఉంది..? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

మరోవైపు పంజాబ్‌లో జులై నుంచి దాదాపు 7వేల మంది డ్రగ్స్‌ పెడ్లర్స్‌ను అరెస్ట్‌ చేశారు. 406కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌ను పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌ మహమ్మారిపై సీఎం భగవంత్‌మాన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..