Covaxin: అమ్మో.. మమ్మల్ని బ్రతకనివ్వరా.! కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..

|

May 17, 2024 | 8:45 AM

మొన్న కొవీషీల్డ్‌.. ఇప్పుడు కోవాక్సిన్‌.. కొవిడ్‌-19 వ్యాక్సిన్లపై వరుసగా వస్తున్న అధ్యయనాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడి కాగా.. ఇప్పుడు.. కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలోనూ తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు బనారస్ హిందూ యూనివర్శిటీ సర్వేలో..

Covaxin: అమ్మో.. మమ్మల్ని బ్రతకనివ్వరా.! కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
Covaxin
Follow us on

మొన్న కొవీషీల్డ్‌.. ఇప్పుడు కోవాక్సిన్‌.. కొవిడ్‌-19 వ్యాక్సిన్లపై వరుసగా వస్తున్న అధ్యయనాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడి కాగా.. ఇప్పుడు.. కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలోనూ తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు బనారస్ హిందూ యూనివర్శిటీ సర్వేలో తేలడం కలకలం రేపుతోంది. బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు కలుగుతాయనే ప్రచారంతో ఇటీవల తీవ్ర దుమారం రేగింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. కోవాగ్జిన్‌కు సంబంధించి ఓ తాజా అధ్యయనం సైతం ఆందోళన కలిగిస్తోంది.

భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ తీసుకున్న వారిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలో మూడో వంతు మంది తొలి ఏడాదిలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడినట్లు బనారస్ హిందూ యూనివర్శిటీ తన అధ్యయనంలో తేల్చింది. వర్శిటీ పరిశోధక బృందం ఏడాదిపాటు పరిశీలించగా.. దాదాపు మూడింట ఒక వంతు మంది ప్రతికూల ప్రభావాలు చెప్పినట్లు సర్వేలో వెల్లడించింది. బనారస్ హిందూ యూనివర్శిటీ అధ్యయనంలో 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు మొత్తం 926 మంది పాల్గొన్నారు. వీరిలో 304 మంది టీనేజర్లు, 124 మంది పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. 10 శాతం మందిలో చర్మ సమస్యలు, సాధారణ రుగ్మతలు, మరికొందరిలో నరాల సంబంధిత సమస్యలు, కంటి సమస్యలు, మహిళల్లో రుతుక్రమ సమస్యలు వచ్చినట్లు అధ్యయనంలో వెల్లడైంది.

కోవాగ్జిన్ తీసుకున్నవారిలో 30 శాతం మంది ఏడాది తర్వాత ఆరోగ్య సమస్యలతో సతమతం అయినట్లు బీహెచ్‌యూ పేర్కొంది. ఇదిలావుంటే.. కోవాక్సిన్‌పై కొన్ని అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ స్పందించింది. కోవాక్సిన్‌పై అనేక అధ్యయనాలు అద్భుతమైన భద్రతా ట్రాక్ రికార్డ్‌ను ప్రదర్శించాయని భారత్ బయోటెక్ వెల్లడించింది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న సంవత్సరం తర్వాత స్ట్రోక్, గ్విలియన్-బారే సిండ్రోమ్ ఆందోళనలను అధ్యయనం చేసిన తర్వాతే.. కోవాగ్జిన్ అద్భుత సేఫ్టీ ట్రాక్ రికార్డ్‌ సొంతం చేసుకుందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. మొత్తంగా.. కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఇటీవల వెల్లడి కాగా.. ఇప్పుడు కోవాగ్జిన్‌తోనూ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు రిపోర్ట్‌ రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.(Source)