
Stone Pelting: వివిధ ప్రాంతాల్లో అక్కడి ఆచార సంప్రదాయాల ఆధారంగా వివిధ పండుగలు నిర్వహించుకోవడం చూస్తుంటాం.. గిరిజన ప్రాంతాల్లో అక్కడి సంప్రదాయాలు, అక్కడి పండుగలు వేరు.. ఇలా జాతుల ఆధారంగా పండుగలు నిర్వహించుకోవడం సర్వసాధారణం. కొన్ని పండుగలు అయితే ఎంతో విచిత్రంగా అనిపిస్తాయి. మరికొన్ని పండుగలు వింతగా ఉంటాయి. కొన్ని పండుగలు అయితే ఎందుకు చేసుకుంటారో అర్థం కాకుండా ఉంటాయి. వందల ఏళ్లుగా వస్తు్న్న ఆచారం అంటూ కొన్ని పండుగలను జరుపుకుంటుంటారు. కొన్ని పండుగలు హింసకు దారితీస్తుందని తెలిసినా.. సంప్రదాయం పేరిట ప్రభుత్వాలు ఆ పండుగలకు అనుమతులివ్వడం, భద్రత కల్పించడం చూస్తుంటాం. ఇలాంటి ఓ వింత పండుగే మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర పరిధిలోని రెండు గ్రామాల మధ్య జరిగింది. ఆపండుగ పేరు రాళ్లు విసురుకునే పండుగ. ఏంది పేరే వింతగా ఉంది. రాళ్లు విసురుకోవడం పండుగ ఏందనుకుంటున్నారా.. ఇది నిజం.. శనివారం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో జరిగిన ఈవింత పండుగలో దాదాపు 150 మందికి పైగా గాయపడ్డారు. అసలు ఈపండుగ ఎందుకు చేసుకుంటారు. ఈపండుగ జరుపుకోవడానికి కారణమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. రీడ్ దిస్ స్టోరీ..
మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర పరిధిలోని పంధుర్న, సావర్ గావ్ గ్రామాల మధ్య గత 300 ఏళ్లుగా రాళ్లు విసురుకునే హింసాత్మక పండుగను జరుపుకుంటున్నారు. ఈపండుగను ఇక్కడ గాట్ మార్ ఉత్సవంగా పిలుస్తారు. ఈపండుగలో రెండు గ్రామాల ప్రజలు నదికి ఇరు వైపులా నిల్చుని ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటారు. ఆగష్టు 27వ తేదీ శనివారం జరిగిన ఈఉత్సవంలో దాదాపు 158 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో విచిత్రం ఏమిటంటే ఈఉత్సవానికి పోలీసు భద్రతతో పాటు, వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచడం కొసమెరుపు.
More than 158 persons were injured, 3 of them critically during the #Gotmar festival in #Pandhurna in #Chhindwara in #MadhyaPradesh, famous for people on either sides of a river raining stones on each other as a tradition passed down from an abduction incident of the past.#Pola pic.twitter.com/2fLNF0rw8V
— Praveen Mudholkar (@JournoMudholkar) August 27, 2022
అసలు ఈగాట్ మార్ ఉత్సవం జరుపుకోవడానికి గల కారణం చూస్తే.. 300 సంవత్సరాల క్రితం పంధుర్న గ్రామానికి చెందిన ఓ యువకుడు సావర్ గావ్ గ్రామానికి చెందిన యువతిని తీసుకుని వెళ్లిపోయాడు. ఆరెండు గ్రామాల మధ్య జామ్ నది ఉంటుంది. ఆయువకుడు అమ్మాయిని తీసుకుని నది దాటుతుండగా అతడిపై సావర్ గామ్ గ్రామస్తులు రాళ్లతో దాడి చేస్తారు. ప్రతిగా పంధుర్న గ్రామాస్తలు రాళ్లతో ఎదురు దాడికి దిగుతారు. ఇలా రెండు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. తదనంతరం ఇదొక సంప్రదాయంగా మారింది. ఈగాట్ మార్ ఉత్సవం సమయంలో రెండు గ్రామాల ప్రజల జామ్ నదికి ఇరువైపులా మోహరిస్తారు. నది మధ్యలో ఉన్న చిన్న ద్వీపం వంటి భూభాగంపై ఉన్న ఎండిపోయిన చెట్టుపై ఒక జెండా ఉంచుతారు. ఆజెండాను ఏ గ్రామానికి చెందిన వ్యక్తి తీసుకువస్తే.. ఆసంవత్సరం ఆగ్రామం విజయం సాధించినట్లు నిర్థారిస్తారు. జెండా తీసుకురావడానికి వెళ్లే వ్యక్తిపై ప్రత్యర్థి గ్రామం వారు తామున్న నదీ తీరం నుంచి రాళ్ల వర్షం కురిపిస్తారు. ఈఉత్సవంలో ఈఏడాది పంధుర్న గ్రామం విజయం సాధించిందని గ్రామాల పెద్దలు ప్రకటించారు. ఈఉత్సవం సందర్భంగా పోలీసు భద్రతతో పాటు.. వైద్య సహాయం కోసం వైద్యులను మోహరించారు. ఈ ఉత్సహనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఇదేమి పండుగరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.