Lakshadweep: లక్షద్వీప్ లో స్థానికుల నిరసనలకు మద్దతుగా కోర్ కమిటీ ఏర్పాటు చేయనున్న విపక్షాలు

|

May 30, 2021 | 6:44 AM

Lakshadweep: లక్షద్వీప్ అభివృద్ధి కోసం అంటూ అక్కడి ఎడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ల పటేల్ ప్రతిపాదించిన అంశాలపై రాజకీయ వేడి మరింత ముదురుతోంది.

Lakshadweep: లక్షద్వీప్ లో స్థానికుల నిరసనలకు మద్దతుగా కోర్ కమిటీ ఏర్పాటు చేయనున్న విపక్షాలు
Lakshadweep
Follow us on

Lakshadweep: లక్షద్వీప్ అభివృద్ధి కోసం అంటూ అక్కడి ఎడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ల పటేల్ ప్రతిపాదించిన అంశాలపై రాజకీయ వేడి మరింత ముదురుతోంది. ఈ అంశాలపై వ్యతిరేకిస్తూ స్థానికంగా వస్తున్న నిరసనలను సమన్వయం చేసి పెద్దగా చేయడానికి ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఈమేరకు ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని లక్షద్వీప్‌లో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. కోర్ కమిటీ ఆన్‌లైన్ లో నిర్వహించిన విపక్షాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, జనతాదళ్ (యు) ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా, ఇకపై నిరసనలను వెల్లడించడానికి సమన్వయ కమిటీ ద్వారా ప్రత్యెక ప్రణాళికలు రూపొంచింది దానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం భావించింది. అందుకోసం కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు.

అదే సమయంలో, లక్షద్వీప్ పరిపాలన విభాగం కోవిడ్ కేసుల పెరుగుదలను చూపుతూ ద్వీపాలలో ప్రవేశించడం, నిష్క్రమించడంపై మరిన్ని ఆంక్షలు విధించింది. ఎంట్రీ పర్మిట్లు ఇవ్వడానికి సింగిల్ పాయింట్ అథారిటీగా జిల్లా మేజిస్ట్రేట్ వ్యవహరిస్తారని ఆదేశాలు జారీ చేశారు. నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్న వారిని కరోనా నిబంధనల పేరుతొ అరెస్టులు చేస్తువస్తున్నారు. కిల్తాన్ ద్వీపంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు 11 మందిని అరెస్టు చేశారు.

మరోవైపు సమాజ్‌వాదీ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గోపాలకృష్ణన్ శనివారం “లక్షద్వీప్‌ను కేరళలో భాగం చేయాలని, లక్షద్వీప్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఐలాండ్ అడ్మినిస్ట్రేటర్ పాలనను అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని” రాష్ట్రపతిని కోరారు.

లక్షద్వీప్ ను టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అక్కడ కొత్తగా కొన్ని నిబంధనలు విధిస్తూ ఎడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ల పటేల్ ప్రత్యెక ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం లక్షద్వీప్ లో గొడ్డుమాంసం పై నిషేధం విధించారు. అలాగే, ఇప్పటివరకూ అక్కడ ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు. స్థానికంగా ఈ రెండు అంశాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంతమైన లక్షద్వీప్ లో అలజడి రేగింది. ప్రతిపక్షాలు కూడా స్థానిక ప్రజలకు మద్దతుగా సంఘటితం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని విపక్షాలు శనివారం సమావేశం జరిపి కొత్తగా కోర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

Also Read: Lakshadweep: లక్ష ద్వీప్ అభివృద్ధికి సవాలక్ష అడ్డంకులు..మతవిశ్వాసాలకు రాజకీయం తోడై పడుతున్న చిక్కుముళ్ళు!

SAVELAKSHYADWEEP: లక్ష్యద్వీప్‌లో వేర్పాటు చిచ్చు.. నియంత్రిస్తున్నారంటూ ఆందోళనపర్వం