Minister Anurag Thakur: వారిది రెండు నాలుకల ధోరణి.. ప్రతిపక్ష ఎంపీల మణిపూర్ పర్యటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్..

|

Jul 30, 2023 | 8:17 PM

ద్వంద్వ ప్రమాణాలను ఇండియా కూటమి పాటిస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. బెంగాల్ హింసను పక్కదోవపట్టించేందుకే ప్రతిపక్ష ఎంపీల మణిపూర్ అని ఎద్దేవ చేశారు. సోమవారం పార్లమెంటులో ఆ వివరాలను అందించాలని.. మొదట ప్రతిపక్ష ఎంపీలు పాల్గొంటే మంచిదని దుయ్యబట్టారు. మహిళలు హింసను ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్‌ను కూడా ప్రతిపక్ష ఎంపీలు సందర్శించి ఉండాల్సిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. అయితే, ఇండియా కూటమికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 20 మంది నేతల బృందం జూలై 29న మణిపూర్‌లో పర్యటించి, అక్కడి పరిస్థితులను అంచనా వేసింది.

Minister Anurag Thakur: వారిది రెండు నాలుకల ధోరణి.. ప్రతిపక్ష ఎంపీల మణిపూర్ పర్యటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్..
Anurag Thakur
Follow us on

మణిపూర్ సమస్య, మహిళల సమస్యలపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. బెంగాల్‌ ఘటనలను దాటవేయడానికి ‘ఇండియా’ కూటమి ప్రయత్నిస్తోందన్నారు. ముందుగా పార్లమెంటు చర్చలో ప్రతిపక్ష ఎంపీలు పాల్గొనాలని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ హయాంలో మణిపూర్‌లో నెలల తరబడి దిగ్బంధనాలను ఎలా ఎదుర్కొన్నారనే ఆరోపణలకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ ఏ ప్రధానమంత్రి లేదా హెచ్‌ఎం పార్లమెంటులో ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. మహిళలు హింసను ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్‌ను కూడా ప్రతిపక్ష ఎంపీలు సందర్శించి ఉండాల్సిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

జూలై 31న పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభమైనప్పుడు మణిపూర్ సంక్షోభంపై చర్చకు రావాలని ప్రతిపక్ష నేతలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఇండియా కూటమికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 20 మంది నేతల బృందం జూలై 29న మణిపూర్‌లో పర్యటించి, అక్కడి పరిస్థితులను అంచనా వేసింది. మణిపూర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రతినిధి బృందాన్ని సోమవారం పార్లమెంటులో తమ అనుభవాన్ని పంచుకోవాలని అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి

“రేపు పార్లమెంటు ఎప్పుడు పని చేస్తుందో చర్చలో పాల్గొని వారి అనుభవాన్ని వివరించవలసిందిగా నేను వారిని అభ్యర్థిస్తున్నాను” అని ఠాకూర్ అన్నారు. అయితే యూపీఏ హయాంలో జరిగిన అశాంతిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అవలంబించిందని.. మణిపూర్ అంశంపై తాము కూడా అదే చేస్తున్నామని ఆయన అన్నారు.

ఏళ్ల తరబడి మణిపూర్‌ అలాంటి పరిస్థితుల్లోనే ఉండిపోయిందని.. అప్పటి ప్రధాని లేదా హోంమంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదని కాంగ్రెస్‌కు సుదీర్ఘ అనుభవం ఉందదని మంత్రి అనురాగ్ ఠాకుర్ గుర్తు చేశారు. బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసను పక్కదోవపట్టించేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోందన్నారు. ఇది సరైన పద్దతి కాదని.. బెంగాల్‌లో జరిగిన హింస దారుణంగా ఉందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం