Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో మాకు కొంత ఉపశమనం.. ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన పహల్గామ్‌ భాదితురాలు

భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై పహల్గాం బాధితులు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ కింద భారతదేశం చేపట్టిన సైనిక ప్రతిస్పందనకు తన మద్దతును తెలియజేస్తూ తమకు కొంతైనా న్యాయం దక్కిందని పలువురు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన ఎన్ రామచంద్రన్‌ కుమార్తె ఆర్తీ మీనన్ ఆపరేషన్ సిందూర్‌పై స్పందించారు. తన తండ్రి మృతి తన కుటుంబానికి తనకు వ్యక్తిగత నష్టం అపారమని.. అది ఎవరూ పూడ్చలేనిదని.. అయితే ఆపరేషన్ సిందూర్ తమకు కొంత మేర ఉపశమనం కలిగించే క్షణం అని అభివర్ణించారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో మాకు కొంత ఉపశమనం.. ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన పహల్గామ్‌ భాదితురాలు
Sindhu On Operation Sindoor

Updated on: May 07, 2025 | 3:16 PM

మన దాయాది దేశం పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం భారత దేశాన్ని నిరంతం ఇబ్బంది పెడుతూ పక్కలో బల్లెంగా మారింది. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్ లోని అందమైన పహల్గామ్ ప్రాంతంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి మతం అడిగి మరీ నరమేథం సృష్టించారు. దాదాపు 27 మంది మరణించారు. ఈ మృతుల కుటుంబాలు ఇప్పటికీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆర్తి.. పాకిస్తాన్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారతదేశం చేసిన దాడి పట్ల తాను గర్వపడుతున్నానని.. కాశ్మీర్‌లో ఉగ్రవాదులు చేసిన “పిరికి” ఉగ్రవాద దాడికి.. భిన్నంగా మన దేశం చేపట్టిన చర్యను “ధైర్య చర్య”గా అభివర్ణించారు. భారతదేశం చేసిన దాడి పట్ల తాను గర్వపడుతున్నానని.. తమకు జరిగిన నష్టాన్ని పూడ్చలేనిది.. అయితే ఇప్పుడు ఈ వార్త వినడం ఉపశమనం కలిగించింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులకు భారతదేశం గట్టిగా స్పందిస్తుందని తాను ఆశిస్తున్నాను.. ఈ సందర్భంగా చేతులు జోడించి ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నా’’ అరి ఆర్తీ అన్నారు.

కేరళలోని కొచ్చికి చెందిన రామచంద్రన్‌ను పహల్గామ్ సమీపంలోని బైసరన్‌లోని ఒక గడ్డి మైదానంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. దాడి సమయంలో అతనితో పాటు తన ఇద్దరు పిల్లలతో ఉన్నఆర్తి తన తండ్రిని కళ్ళ ముందే కాల్చి చంపడం చూసింది. ఉగ్రవాదులు AK-47 తో భారత గడ్డపై అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే భారతదేశం ప్రతిస్పందన భిన్నంగా ఉగ్రవాద లక్ష్యాలపై దృష్టి సారించి.. చేసిన దాడి. ఈ రెండిటికి చాలా తేడా ఉంది… వారిది పిరికి చర్య, మనది ధైర్యం,” అని ఆర్తి బుధవారం మీడియాతో అన్నారు.

త్రివిధ దళాల సైనిక చర్యకు ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టడాన్ని ఆమె ప్రశంసించారు. ఈ పేరు తనలాంటి కుటుంబాలకు భావోద్వేగ ప్రాముఖ్యతను కలిగి ఉందని అన్నారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ కు ఇంతకంటే సరైన పేరు మరొకటి లేదు. ఈ దాడిలో నా తల్లితో సహా మహిళలు వితంతువులయ్యారు. అందుకనే ఈ పేరు సరిగ్గా సరిపోతుందని చెప్పింది” అని ఆర్తి అన్నారు.

ఇవి కూడా చదవండి

మే 7వ తేదీ బుధవారం అర్ధరాత్రి 1.44 సమయంలో భారత్ ఆపరేషన్ సిందూర్‌ ను ప్రారంభించింది. పీఓకేతో పాటు పాక్‌లోని ఉగ్రస్థావరాలై దాడులకు దిగింది. మొత్తం 9 ప్రాంతాలపై బాంబులతో దాడుల చేసింది. గుర్తించిన ఉగ్రవాద లక్ష్యాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో సైనిక వైమానిక, నావికా దళాలు పాల్గొన్నాయి. దాడుల్లో సుమారు 90 మంది మరణించినట్టు తెలుస్తోంది. జైష్ ఏ మహ్మద్, లష్కరే తయ్యబా ఉగ్రసంస్థలను టార్గెట్ చేసుకునేందుకు భారత్‌ ఈ స్థావరాలను ఎంచుకుంది. భారత చేపట్టిన ఈ చర్యలకు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇజ్రాయెల్, రష్యా సహా అనేక దేశాలు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ భారత్‌కు మద్దతు ప్రకటించాయి.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us