ఇదేదో ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు.. బెంగాల్‌ వయా పుదుచ్చేరి టు మహారాష్ట్ర

|

Feb 12, 2021 | 3:05 PM

బెంగాల్‌ వయా పుదుచ్చేరి టు మహారాష్ట్ర. అవును..పాండిచ్చేరి నుంచి పశ్చిబెంగాల్‌దాకా..గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ గొడవ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ జగదీష్‌..

ఇదేదో ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు.. బెంగాల్‌ వయా పుదుచ్చేరి టు మహారాష్ట్ర
Follow us on

Clash Between CMs and Governors :  గవర్నర్‌ వర్సెస్‌ సీఎం..ఎస్‌..ఇదేదో ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు. బెంగాల్‌ వయా పుదుచ్చేరి టు మహారాష్ట్ర. అవును..పాండిచ్చేరి నుంచి పశ్చిబెంగాల్‌దాకా..గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ గొడవ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ జగదీష్‌ ధన్కర్‌, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య షురూయై..మహారాష్ట్ర వరకూ పాకింది.

మహారాష్ట్రలో ఎన్నికలకు ముందే బీజేపీ-శివసేన మధ్య తెగదెంపులయ్యాయి. ఎన్నికల తర్వాత రెండుపార్టీల మధ్య తరచూ మాటలయుద్ధం జరుగుతోంది. ఆటోమేటిక్‌గా గవర్నర్‌తో కూడా..ఉద్ధవ్‌ సర్కార్‌కి గ్యాప్‌ పెరిగిపోయింది. తాజాగా గవర్నర్ కోశ్యారి ఫ్లైట్‌ జర్నీకి ప్రభుత్వం ఎర్రజెండా ఊపడంతో వివాదం మరింత ముదిరింది.

ఉత్తరాఖండ్‌లో జలవిలయం తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు డెహ్రాడూన్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారి. ముంబై ఎయిర్‌పోర్టుకు వెళ్లిన గవర్నర్‌ రెండుగంటలపాటు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. తీరా ప్రభుత్వ విమానంలో కూర్చున్న పావుగంట తర్వాత…టేకాఫ్‌కు అనుమ‌తి రాలేద‌ని కెప్టెన్‌ చెప్పడంతో…చేసేదేం లేక మ‌రో విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు గవర్నర్‌.

వారం క్రితమే గవర్నర్‌ టూర్‌ గురించి ప్రభుత్వానికి తెలిపింది రాజ్‌భవన్‌. అయినా ఆయనకు పర్మిషన్‌ ఇవ్వలేదు ఉద్ధవ్‌ సర్కార్‌. ప్రభుత్వ నిబంధనల ప్రకారం…సీఎం, డిప్యూటీ సీఎం మాత్రమే ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఇతరులు ఎవరు వాడాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అందుకే గవర్నర్‌కు అనుమతి లభించలేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అయితే కక్షపూరితంగానే గవర్నర్‌కు ప్రభుత్వం విమాన ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌.

కొన్నాళ్లుగా గవర్నర్‌తో ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వానికి కొన్ని అంశాలపై వివాదం నడుస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత మహారాష్ట్రలో ఆలయాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని గవర్నర్‌ ప్రశ్నించారు. దీనిపై సీఎం, గవర్నర్‌ మధ్య లేఖల యుద్ధం జరిగింది. ఇప్పుడు గవర్నర్‌ విమాన ప్రయాణానికి అనుమతి నిరాకరించింది ప్రభుత్వం. రాష్ట్రప్రభుత్వంతో గవర్నర్‌కు గ్యాప్‌ పెరుగుతున్న టైంలో..మరింత మంట రాజేసిందీ వివాదం.

ఇక కొన్ని నెలలుగా బెంగాల్‌ గవర్నర్‌-సీఎం మమతా బెనర్జీ మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనలో.. ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును తప్పుబడుతూ గవర్నర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఔట్‌ సైడర్స్‌ అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి మమత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన..పద్ధతిగా మాట్లాడాలంటూ హితవు పలికారు. అలాగే పోలీసుల తీరును విమర్శిస్తూ.. ఈ ఘటనకు సంబంధించి కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఇక అప్పటి నుంచి ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య మరింతగా అగాధం పెరిగింది.

ఇక పుదుచ్చేరి గవర్నర్‌ కిరణ్‌ బేడి..సీఎం నారాయణస్వామి మధ్య కూడా వివాదం కొనసాగుతోంది. గవర్నర్‌ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని..అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి. కిరణ్‌ బేడీ తీరును నిరసిస్తూ ఆందోళనలు కూడా చేశారు. గవర్నర్‌ కిరణ్‌బేడీని తొలగించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి నారాయణస్వామి.

ఇవి కూడా చదవండి

West Bengal Bandh : రసవత్తరంగా మారిన బెంగాల్‌ రాజకీయాలు.. ఉదయం నుంచే నిరసన సెగలు..

Loan to Buy a Helicopter :హెలికాప్టర్ కొనుక్కోవడానికి రుణం ఇప్పించండి… రాష్ట్రపతికి లేఖ రాసిన ఓ మహిళ..