One Nation One Election: నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లులు.. మోదీ సర్కార్ ప్లాన్ ఏంటి?

నేడు పార్లమెంట్‌లోకి జమిలి ఎన్నికల బిల్లును NDA సర్కార్ ప్రవేశ పెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ రెండు బిల్లులను సోమవారం ప్రవేశపెడుతారనే చర్చ జరిగింది. కానీ లోక్‌సభ రివైజ్డ్‌ బిజినెస్‌ జాబితాలో ఆ రెండు అంశాల ప్రస్తావన లేదు.

One Nation One Election: నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లులు.. మోదీ సర్కార్ ప్లాన్ ఏంటి?
One Nation One Election
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 17, 2024 | 9:42 AM

జమిలి ఎన్నికల బిల్లు నేడు పార్లమెంట్‌ ముందుకు రానుంది. నిజానికి నిన్నే వన్‌ నేషన్‌ -వన్‌ ఎలక్షన్‌కు సంబందించిన రెండు బిల్లులు ప్రవేశపెడుతారని అందరూ భావించారు. కానీ ఒకవైపు ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు ..మరోవైపు రాజ్యసభలో రాజ్యంగం పైన చర్చ నేపథ్యంలో బిల్లు వాయిదా పడింది. నేడు జమిలి ఎన్నికల బిల్లు లోకసభలో ప్రవేశ పెట్టబోతున్నారు. మరి పార్లమెంట్‌లో బలం సాధించే దిశగా ఎన్డీయే సర్కార్‌ ప్లానేంటి? అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు

లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఒకే సారి నిర్వహించే విధంగా వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌ నినాదాన్ని ఎన్‌డీఏ సర్కార్‌ తెరపైకి తెచ్చింది. ఇటీవలే జమిలి ఎన్నికల బిల్లును కేబినెట్‌ ఆమోదించింది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ రెండు బిల్లులను సోమవారం ప్రవేశపెడుతారనే చర్చ జరిగింది. కానీ లోక్‌సభ రివైజ్డ్‌ బిజినెస్‌ జాబితాలో ఆ రెండు అంశాల ప్రస్తావన లేదు. దాంతో వాయిదా అంశంపై తెరపైకి వచ్చింది. మంగళవారం విధిగా సభకు హాజరుకావాలని బీజేపీ ఎంపీలకు విప్‌ జారీ అయింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్ మంగళవారం లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధమైంది.

జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు కనీసం 67 శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67 శాతం అంటే.. 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉన్నది. ఐతే లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది ఎంపీల మద్దతు ఉంటే..ఇండియా కూటమికి 235 మంది ఎంపీలున్నారు.  అయినా సరే బిల్లు పాస్‌ అవుతుందనే ధీమాతో ఎన్‌డీఏ సర్కార్ ఉంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే .. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందితే.. 2029నుంచే జమిలి ఎన్నికలు జరుగుతాయిని నిపుణులు చెబుతున్నారు.

నిజానికి జమిలి ఎన్నికలు కొత్త కాదు. 1952 , 1967లో లోక్‌సభ , అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించిన చరిత్ర ఉంది. అయితే ఈసారి వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మంగళవారం పార్లమెంట్‌లో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జమిలి బిల్లు పాస్‌ కావడం ఖాయమని ఎన్డీఏ సర్కార్ ధీమాగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి