Tollywood: అప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. ఆ స్టార్ హీరోకు బావ.. ఎవరంటే.

సినీరంగంలో ఈ హీరోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎప్పుడూ విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. హిట్టు, ప్లాపులతో ఎలాంటి సంబంధం లేకుండానే వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..

Tollywood: అప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. ఆ స్టార్ హీరోకు బావ.. ఎవరంటే.
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2024 | 9:34 AM

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో. కానీ ఒకప్పుడు అతడు బ్యాడ్మింటన్ ప్లేయర్. పైన ఫోటోలో బ్యాడ్మింటన్ రన్నరప్ మెడల్ అందుకుంటున్న కుర్రాడిని గమనించారా.. ? ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోలలో ఒకరు. విభిన్నమైన కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. అంతేకాదు.. తెలుగు స్టార్ హీరోకు బావ కూడా. త్వరలోనే ఈ హీరో కొడుకు సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. అతడు మరెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు. దివంగత హీరో కృష్ణ అల్లుడు. కృష్ణ చిన్నకూతురు ప్రియదర్శిని ఘట్టమనేని భర్తే సుధీర్ బాబు. కానీ వీరిద్దరి స్టార్ డమ్ ఉపయోగించుకోకుండానే హీరోగా సినీరంగంలోకి అరంగేట్రం చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

2012లో ఏమాయ చేసావే సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత శివ మనసులో శ్రుతి సినిమాతో హీరోగా మారాడు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సినిమాల్లోకి రాకముందు సుధీర్ బాబు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్ లో నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. ఒకసారి డబుల్స్ భాగస్వామిగా పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆడాడు. అప్పట్లో బ్యాడ్మింటన్ రన్న రప్ మెడల్ అందుకుంటున్న ఫోటో ఇప్పుుడు నెట్టింట తెగ వైరలవుతుంది.

దీంతో సుధీర్ బాబు బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అటు హీరోగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sudheer Babu (@isudheerbabu)

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో..
అప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో..
వామ్మో రాష్ట్రపతి నుంచి మెసేజ్.. ఏంటా అని ఓపెన్ చేయగా..
వామ్మో రాష్ట్రపతి నుంచి మెసేజ్.. ఏంటా అని ఓపెన్ చేయగా..
హా.. హాసిని ఆస్తులు తెలిస్తే మీ గుండె గుభేల్
హా.. హాసిని ఆస్తులు తెలిస్తే మీ గుండె గుభేల్
చేపలు పడుదామని వెళ్లి కళ్లు తేలేసిన వ్యక్తి.. కట్ చేస్తే
చేపలు పడుదామని వెళ్లి కళ్లు తేలేసిన వ్యక్తి.. కట్ చేస్తే
ఫాలో-ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగుతేజంపైనే
ఫాలో-ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగుతేజంపైనే
మెదక్ చర్చికి 100 ఏళ్ళు..దీని నిర్మాణం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ
మెదక్ చర్చికి 100 ఏళ్ళు..దీని నిర్మాణం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ
బాబోయ్.! మళ్లీనా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్..
బాబోయ్.! మళ్లీనా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్..
పనీర్‌ తింటే ఎముకలు స్ట్రాంగ్‌ అవ్వడమే కాదు.. మరెన్నో ప్రయోజనాలు
పనీర్‌ తింటే ఎముకలు స్ట్రాంగ్‌ అవ్వడమే కాదు.. మరెన్నో ప్రయోజనాలు
బిగ్‏బాస్ హౌస్‏లో.. బయట ఇలా.. వాళ్లే ముఖ్యమంటున్న నిఖిల్..
బిగ్‏బాస్ హౌస్‏లో.. బయట ఇలా.. వాళ్లే ముఖ్యమంటున్న నిఖిల్..
W,W,W,W.. 4 బంతుల్లో 4 వికెట్లు.. టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్‌
W,W,W,W.. 4 బంతుల్లో 4 వికెట్లు.. టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్‌