W,W,W,W.. 4 బంతుల్లో 4 వికెట్లు.. చిన్న కథ కాదురా సామీ.. టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్‌తో బీభత్సం

Hernan Fennel Hat Trick: హెర్నాన్ ఫెన్నెల్ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. అతను తాజాగా టీ20 క్రికెట్‌లో రెండవసారి హ్యాట్రిక్ సాధించాడు. ఈ అర్జెంటీనా బౌలర్ 4 బంతుల్లో 4 వికెట్లు తీసి, దిగ్గజ బౌలర్ల జాబితాలో చేరాడు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

W,W,W,W.. 4 బంతుల్లో 4 వికెట్లు.. చిన్న కథ కాదురా సామీ.. టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్‌తో బీభత్సం
Hernan Fennel Hat Trick
Follow us
Venkata Chari

|

Updated on: Dec 17, 2024 | 8:12 AM

Hernan Fennel Hat Trick: ప్రతి బౌలర్ ఒకటి లేదా రెండు వికెట్లు తీసిన తర్వాత హ్యాట్రిక్ పూర్తి చేయాలని కోరుకుంటాడు. ఇటువంటి పరిస్థితిలో, 4 బంతుల్లో 4 వికెట్లు తీయడం ఎవరికైనా ప్రత్యేకమైనదిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అర్జెంటీనా ఆటగాడు హెర్నాన్ ఫెన్నెల్ చరిత్ర సృష్టించాడు. ఈ బౌలర్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ అమెరికా క్వాలిఫైయర్‌లో డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. డిసెంబర్ 15న, ఈ బౌలర్ టీ20లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఈ ఘనతను సాధించాడు. కేమన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ బౌలర్ డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ క్రమంలో ఫెనెల్ 4 బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అతను ఓవర్ మూడో బంతికి ట్రాయ్ టేలర్‌ను అవుట్ చేసి, తర్వాతి మూడు బంతుల్లో అలెస్టర్ ఇఫిల్, రోనాల్డ్ ఎబాంక్స్, అలెజాండ్రో మోరిస్‌ల వికెట్లను తీసి అద్భుతాలు చేశాడు.

దీంతో ఫెన్నెల్ మ్యాచ్‌లో మొత్తం 5 వికెట్లు తీశాడు. ఈ స్థితిలో 14 పరుగులిచ్చి మొత్తం 5 వికెట్లు తీశాడు. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఆరో బౌలర్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్, లసిత్ మలింగ, కర్టిస్ కాన్ఫెర్, జాసన్ హోల్డర్, వసీమ్ యాకోబ్‌లతో కూడిన బౌలర్ల జాబితాలో ఫెన్నెల్ చేరాడు. అయితే, బౌలర్ 5 వికెట్లు పడగొట్టినప్పటికీ, అర్జెంటీనా జట్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. కేమన్ ఐలాండ్స్ 116 పరుగులు చేసింది. అర్జెంటీనా 94 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

దిగ్గజ బౌలర్ల జాబితాలో చోటు..

ఈ డబుల్ హ్యాట్రిక్‌తో, 36 ఏళ్ల అర్జెంటీనా పేసర్ టీ20 క్రికెట్‌లో ఒకటి కంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఇంతకుముందు, ఐసిసి పురుషుల టి20 ప్రపంచకప్ అమెరికాస్ రీజినల్ క్వాలిఫైయర్ 2021లో పనామాపై ఫెన్నెల్ ఈ ఘనత సాధించాడు. దీంతో ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే ఆరో బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు వసీం అబ్బాస్, పాట్ కమిన్స్, మార్క్ పావ్లోవిచ్, టిమ్ సౌదీ, లసిత్ మలింగ మాత్రమే ఈ ఘనత సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..