పార్లమెంట్ సమావేశాల చివరి రోజు జైశ్రీరాం నినాదాలు మారుమోగాయి. అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణంతో ఎన్నో తరాల కల నెరవేరిందన్నారు ప్రధాని మోదీ. ఇది చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుందన్నారు. రామమందిర నిర్మాణంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగించడం గర్వకారణంగా ఉందని అన్నారు మోదీ. దీంతో సభలో జైశ్రీరాం నినాదాలు మారుమోగాయి. బీజేపీ సభ్యులు ప్రధాని మోదీని ప్రశంసిస్తూ నినాదాలు చేశారు.
రామమందిర నిర్మాణానికి.. ధన్యవాద తీర్మానంపై వాడివేడి చర్చ జరిగింది. ఒక మతానికి మాత్రమే ప్రయోజనం చేకూర్చరాదని, బాబ్రీమసీదు జిందాబాద్ అని ఒవైసీ అన్నారు. అంతుకుముందు లోక్‌సభలో రామమందిర నిర్మాణానికి ధన్యవాద తీర్మానంపై వాడివేడి చర్చ జరిగింది. కేంద్రప్రభుత్వం దేశప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాలన్నారు ఒవైసీ. ఒక మతానికి మాత్రమే ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండరాదన్నారు. బాబ్రీ మసీదుకు ఇప్పటికీ తన మద్దతు ఉందని , బాబ్రీమసీదు జిందాబాద్ అని అన్నారు ఒవైసీ.
అయితే రాముడు ఒకే మతానికి పరిమితం కాదని ఒవైసీకి కౌంటరిచ్చారు అమిత్‌షా. ఉర్ధూలో కూడా రామాయణం రాశారని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో కోట్లాదిమంది ఆకాంక్ష నెరవేరిందన్నారు. రామందిరం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ముల్లా మసీ కూడా రామాయణాన్ని రాసిన విషయాన్ని ఒవైసీ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎన్నో దేశాలు రామాయణాన్ని స్వీకరించాయి. నేపాల్,జావా,కాంబోడియా, ఇండోనేషియా దేశాల్లో స్థానక భాషల్లో అనువదించారు. ఆదివాసీలు కూడా రాముడిని దైవంగా కొలుస్తారని అమిత్‌షా అన్నారు. మొత్తానికి 17వ పార్లమెంట్ సమావేశాల చివరిరోజు రామనామ స్మరణ చేసుకున్నారు ఎంపీలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..