Viral Accident: మీ గుండెలు గట్టివి అయితేనే ఈ యాక్సిడెంట్ వీడియో చూడండి..?

గ్రేటర్ నోయిడాలో రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన దారుణ ఘటన ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎంత ప్రాణాంతకమో చాటింది. పెళ్లి ముందు రోజుల్లో ఉన్న యువకుడు తుషార్, రైల్వే గేట్ మూసి ఉన్నా బైక్‌పై దాటే ప్రయత్నం చేయగా, రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్‌పై బైక్ జారి పడటంతో లేపేందుకు ప్రయత్నించిన అతను రైలు హార్న్ విన్నప్పటికీ తప్పించుకోలేకపోయాడు.

Viral Accident: మీ గుండెలు గట్టివి అయితేనే ఈ యాక్సిడెంట్ వీడియో చూడండి..?
Train Accident

Edited By: Ram Naramaneni

Updated on: Oct 13, 2025 | 9:54 PM

రైల్వే క్రాసింగ్‌ను జాగ్రత్తగా చూడకుండా దాటడం ఎంత ప్రమాదకరమో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ దారుణ ఘటన చూపిస్తోంది. బైక్‌పై వెళ్తున్న యువకుడు రైల్వే క్రాసింగ్ దాటే ప్రయత్నంలో రైలు ఢీకొని దూరం విసిరిపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడా సమీపంలోని దాతావ్లీ గ్రామం వద్ద జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

దాతావ్లీ గ్రామానికి చెందిన తుషార్ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వచ్చే నెలలోనే అతని పెళ్లి జరగాల్సి ఉంది. కానీ పెళ్లి ముందు మరణం అతన్ని తన చెంతకు తీసుకెళ్లింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో తుషార్ బైక్‌పై వేగంగా రైల్వే క్రాసింగ్ దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో ట్రాక్‌పై బైక్ చక్రం జారి పడిపోయింది. బైక్‌ను లేపడానికి ప్రయత్నిస్తుండగా రైలు హార్న్ వినిపించడంతో అతను బైక్ వదిలి పరుగెత్తాడు. కానీ కొద్ది అడుగులు కూడా వేయకముందే వేగంగా వస్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. అతను గాల్లోకి ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ప్రమాదాన్ని ప్రజలు ఓ పాఠంలా భావించాలి. రైల్వే గేట్లు మూసివేసి ఉన్నప్పుడు ఓపికగా వేచి ఉండటం ఎంత ముఖ్యమో ఇది చూపిస్తోంది. తుషార్ కేవలం ఒక నిమిషం ఆగి ఉంటే లేదా ట్రాక్‌పై కాకుండా పక్కకు పరిగెత్తి ఉంటే అతని ప్రాణం మిగిలి ఉండేది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.