Omicron: గత ఏడాదికిపైగా ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన కరోనా.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టి ఎవరి పనులు వారు చేసుకుంటున్న క్రమంలో మరో కొత్త వేరియంట్ కలవర పెడుతోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ టీకా అదనపు డోసులపై ప్రకటన చేయాలని ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, అలాగే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి అదనపు డోసు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 12 నుంచి 18 ఏళ్ల వయసున్నవారికి వ్యాక్సిన్ వేసే ప్రతిపాదనను వేగవంతంగా పరిశీలించాలని కోరింది. ఇక సౌతాఫ్రికాలో నమోదైన ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య భారత్‌లో 23కు చేరింది. ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ వ్యాక్సిన్ తీసుకోవాలని, అలాగే మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
నిర్లక్ష్యం వహించినట్లయితే భారీ ఎత్తున విరుచుకుపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల బయటపడ్డ ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. అయితే కోవిడ్ నిబంనదలు పాటిస్తూ అర్హులైన వారు వ్యా్క్సిన్ తీసుకోవడంపై దృష్టి పెట్టాలి.
ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఇక ఈ వేరియంట్ భారత్‌లో కూడా వ్యాపించడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.
ఇప్పటికే కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో కొత్త వేరియంట్ వ్యాపించడంతో అందరిలో ఆందోళన మొదలైంది. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్.. డెల్టా వేరియంట్ కంటే అతి వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అప్రమత్తం చేస్తోంది. దీంతో భారత్ కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. విదేశీ ప్రయాణికులకుపై ఆంక్షలు విధిస్తోంది.
ఇవి కూడా చదవండి: