విధి ఆడిన వింత నాటకం.. ప్రమాదంలో భర్త దుర్మరణం.. రెండు రోజులకే భార్య..!

భువనేశ్వర్‌లోని హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో దిలీప్ సుమంత్రయ్ పనిచేస్తున్నాడు. శుక్రవారం జరిగిన గ్యాస్ పేలుడు దుర్ఘటలో దిలీప్ సమంత్రయ్‌తో సహా ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడు. ఔట్ డోర్ ఏసీ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో కంటైనర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

విధి ఆడిన వింత నాటకం.. ప్రమాదంలో భర్త దుర్మరణం.. రెండు రోజులకే భార్య..!
Odisha Couple (File Photo)

Updated on: Jan 01, 2024 | 5:16 PM

విధి ఆడిన వింత నాటకంలో భార్యాభర్తలు ఇద్దరూ రోజుల వ్యవధిలో తనువు చాలించారు. గుండెలు పిండేసే ఈ విషాద ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్‌లోని హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో దిలీప్ సుమంత్రయ్ పనిచేస్తున్నాడు. శుక్రవారం జరిగిన గ్యాస్ పేలుడు దుర్ఘటలో దిలీప్ సమంత్రయ్‌తో సహా ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడు. ఔట్ డోర్ ఏసీ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో కంటైనర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలపాలైన దిలీప్‌ చికిత్సా ఫలితం లేకుండా మృతి చెందాడు.

దిలీప్ హఠాన్మరణంతో ఆయన సతీమణి సునా సమంత్రయ్ తీవ్ర మనోవేదనకు గురైయ్యింది. తనను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న భర్త ఇక లేడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక కుములిపోయింది.  దిలీప్, సునాకు రెండేళ్ల క్రితం వివాహం కాగా.. వారికి పిల్లలు లేరు. దిలీప్ మరణాన్ని జీర్ణించుకోలేని సునా.. సోమవారంనాడు తన తండ్రి నివాసంలోని పడక గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ మరణించడంతో వారి కుటుంబాలు, స్వగ్రామాల్లో విషాదం అలుముకుంది.

మృతురాలి నుంచి ఎలాంటి సూసైడ్ లెటర్ లభ్యం కాలేదు. సునాది ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. భర్త మరణంతో తీవ్ర మనోవేదనకు గురై ఆమె ఆత్మహత్యకు పాల్పినట్లు తెలిపారు.

(జీవిత సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని నిలవడమే జీవితం. ఆత్మహత్యకు ప్రేరేపించే ఆలోచనలు ఉంటే మానసిక నిపుణులను సంప్రదించి తగిన కౌన్సిలింగ్ తీసుకోవాలి)