Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం కేసులో ఏడుగురు రైల్వే సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు..షాకింగ్‌ నిజాలు!

|

Jul 13, 2023 | 12:02 PM

సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంతా, సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉంచారు. కాగా, బాలాసోర్ రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ నివేదికలో వెల్లడైన అంశాలు.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం కేసులో ఏడుగురు రైల్వే సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు..షాకింగ్‌ నిజాలు!
Odisha Train Tragedy
Follow us on

దేశాన్ని కుదిపేసి 293 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో ఏడుగురు ఉద్యోగులను భారతీయ రైల్వే సస్పెండ్ చేసింది. డ్యూటీ సమయంలో అప్రమత్తంగా ఉండనందుకు స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, మెయింటెయినర్‌తో సహా 7 మందిని సస్పెండ్ చేసినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ మిశ్రా తెలిపారు. బాలాసోర్ విపత్తుకు సంబంధించి సిబిఐ ఇప్పటివరకు ముగ్గురు రైల్వే అధికారులను అరెస్టు చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండిఉంటే పెను ప్రమాదం తప్పేదని అన్నారు. సౌత్-ఈస్టర్న్ రైల్వే కొత్త GM, DRM గత బుధవారం బహనాగ బజార్, బాలాసోర్ రైల్వే స్టేషన్లను సందర్శించారు. దీంతో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రైల్వే శాఖ.

సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంతా, సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉంచారు. కాగా, బాలాసోర్ రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ నివేదికలో వెల్లడైన అంశాలు. సిగ్నలింగ్ అండ్ ఆపరేషన్స్ (ట్రాఫిక్) విభాగం విఫలమైందని తేలింది. బెహనాగా స్టేషన్‌లోని ఈ రెండు విభాగాల ఉద్యోగులే ప్రమాదానికి కారణమని నివేదికలో పేర్కొన్నారు. ట్రాక్ నిర్వహణ తర్వాత భద్రతా ప్రోటోకాల్ అనుసరించబడలేదు. రైలు వెళ్లే ముందు భద్రతా ఏర్పాట్లను పరిశీలించలేదని రైల్వే బోర్డుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహంగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్ల మధ్య జరిగిన ప్రమాదంలో 293 మంది మరణించగా, 1,200 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాద దుర్ఘటన యావత్‌ దేశాన్ని కుదిపేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..