ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది దుర్మరణం పాలయ్యారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్- హావ్‌డా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించిన తమ వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు విలవిలలాడుతున్నారు. ఎక్కడ వెతికినా.. ఏ అధికారిని అడిగినా సరైన సమాధానం లభించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతూ కుమిలిపోతున్నారు.
అయితే, ఈ ఘోర రైలు ప్రమాదం అనంతరం భద్రక్ జిల్లా సుగొ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు హుటాహుటిన బాలేశ్వర్ చేరుకుని.. తన కుమారుడి జాడ కోసం వెతుకుతున్నారు. ఫలానా రైలులో ప్రయాణిస్తున్న తన కుమారుడి జాడ చెప్పాలంటూ రోదిస్తూ కనిపించినవారినల్లా ప్రశ్నించారు.
చివరకు.. మృతదేహాలు ఉంచిన ప్రదేశానికి వెళ్లి ఒక్కో మృతదేహం ముసుగు తొలగిస్తూ కుమారుడు ఇక్కడైనా కనపడతాడేమోనంటూ చూశారు. అయినా ఫలితం లేకపోవడంతో తన కుమారుడి ఆచూకీ కోసం వేకువజాము నుంచి గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆయన ఎక్కడున్నాడో తెలియడం లేదంటూ గుండెలవిసేలా రోదించారు.
వీడియో..
This is heartbreaking ?
A father looking for his son among the dead. ?#OdishaTrainAccident pic.twitter.com/eZZDAO94BR
— Ketofol☀️ (@aka911_) June 3, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..