Leopard: అడవి పందుల కోసం వల పెడితే చిరుత చిక్కింది.. కట్ చేస్తే…

|

Nov 21, 2024 | 9:50 AM

వేటగాళ్లు పందుల కోసం వేసిన ఉచ్చు సెట్ చేశారు. అందులో అనూహ్యంగా చిరుత చిక్కింది. వారు దాన్ని చంపి, మాంసాన్ని వండుకొని తినడం చర్చనీయాంశమైంది. నిందితులను అరెస్ట్ చేసి.. మిగిలిపోయిన చిరుత మాంసాన్ని, ఇతర భాగాలను అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Leopard: అడవి పందుల కోసం వల పెడితే చిరుత చిక్కింది.. కట్ చేస్తే...
Poachers
Follow us on

ఇటీవల చిరుతలు, ఎలుగుబంట్లు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అలాగే పంట పొలాల్లోనూ సంచరిస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇక అడవుల్లో తిరిగే పులులు, చిరుతలు వేటగాళ్లకు బలైపోతున్నాయి. ఇటీవల అటవీప్రాంతంలో అనుమానాస్పదంగా మృతిచెందిన చిరుతల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వేటగాళ్లు ఉచ్చులో చిక్కుకున్న చిరుతను చంపి వండుకు తినేశారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో పడిన చిరుతను చంపేసిన వేటగాళ్లు ఆపై దానిని వండుకుతినేశారు. ఒడిశాలోని నౌపడ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. జిల్లాలోని దియోధరా గ్రామ సమీపంలోని అడవిలో కొందరు వేటగాళ్లు అడవి పందుల కోసం ఉచ్చు పెట్టారు. అందులో పందికి బదులు చిరుత చిక్కింది. చిక్కిన చిరుతను వదలలేదు వేటగాళ్లు. దానిని చంపి.. మాంసం వండుకుని తినేశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందడంతో.. నిందితుల ఇళ్లపై దాడి చేయడంతో వారి బాగోతం రూడీ అయింది. మిగిలిన చిరుత మాంసాన్ని, ఇతర శరీర భాగాలను అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అటవీ జంతువుల సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిరుతను వండుకుని తిన్న ఘటనపై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సుశాంత నంద విస్మయం వ్యక్తం చేశారు. చిరుతను చంపి తినడం గతంలో ఎన్నడూ చూడలేదని, ఇది అత్యంత అనాగరిక చర్య అని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.