గర్భవతిని ఆరు కిలో మీటర్లు మోసిన ఎమ్మెల్యే

| Edited By:

Feb 11, 2020 | 2:11 PM

నొప్పులతో వేదన అనుభవిస్తోన్న ఓ గర్భవతిని.. ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే ఆరు కిలోమీటర్లు మోసి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతోంది. దబూగాంకి చెందిన ఎమ్మెల్యే మన్హర్ రంధారి.. స్థానికంగా ఉన్న గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇంతలోనే అక్కడే ఉన్న ఓ గర్భవతికి నొప్పులు వచ్చాయి.. వెంటనే ఆయన ఆంబులెన్స్‌కి ఫోన్ చేయగా, రోడ్లు బాలేదని.. గ్రామానికి రావడానికి నిరాకరించారు ఆస్పత్రి సిబ్బంది. దీంతో… స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరికొందరు […]

గర్భవతిని ఆరు కిలో మీటర్లు మోసిన ఎమ్మెల్యే
Follow us on

నొప్పులతో వేదన అనుభవిస్తోన్న ఓ గర్భవతిని.. ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే ఆరు కిలోమీటర్లు మోసి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతోంది. దబూగాంకి చెందిన ఎమ్మెల్యే మన్హర్ రంధారి.. స్థానికంగా ఉన్న గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇంతలోనే అక్కడే ఉన్న ఓ గర్భవతికి నొప్పులు వచ్చాయి.. వెంటనే ఆయన ఆంబులెన్స్‌కి ఫోన్ చేయగా, రోడ్లు బాలేదని.. గ్రామానికి రావడానికి నిరాకరించారు ఆస్పత్రి సిబ్బంది. దీంతో… స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరికొందరు గర్బవతిని ఆరు కిలోమీటర్లు మోసి.. ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనమైంది. ఎమ్మెల్యే చేసిన సేవకు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు.