Chhattisgarh: ఒడిశా రైలు ప్రమాదం మరువక ముందే హడలెత్తించిన మరో రెండు ఘటనలు.. ఒకే ట్రాక్‌లోకి రెండు ట్రైన్స్..!

ఒడిశా ట్రైన్‌ యాక్సిడెంట్‌ మరవక ముందే.. చత్తీస్‌ఘడ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌ పైకి రెండు రైళ్లు రావడంతో ప్రయాణికులు కంగారు పడిపోయారు. అయితే, రైల్వే అధికారుల వివరణతో అంతా కూల్ అయ్యారు. అటు మంచిర్యాల జిల్లాలో రెండు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రమాదం తప్పింది.

Chhattisgarh: ఒడిశా రైలు ప్రమాదం మరువక ముందే హడలెత్తించిన మరో రెండు ఘటనలు.. ఒకే ట్రాక్‌లోకి రెండు ట్రైన్స్..!
Train Accident

Updated on: Jun 12, 2023 | 8:38 AM

ఒడిశా ట్రైన్‌ యాక్సిడెంట్‌ మరవక ముందే.. చత్తీస్‌ఘడ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌ పైకి రెండు రైళ్లు రావడంతో ప్రయాణికులు కంగారు పడిపోయారు. అయితే, రైల్వే అధికారుల వివరణతో అంతా కూల్ అయ్యారు. అటు మంచిర్యాల జిల్లాలో రెండు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌-జైరాంనగర్‌ మార్గంలో ఇటీవల ఒక ప్యాసింజర్‌, గూడ్స్‌ రైలు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చేందుకు అనుమతి ఉన్నదని, ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు వచ్చినా అవి ఢీ కొట్టుకోవని, సిగ్నల్‌ పడి కొద్ది దూరంలో నిలిచిపోతాయని వివరణ ఇచ్చింది. ట్రాక్‌పై గూడ్సు రైలు ఆగి ఉన్న విషయం తమకు తెలుసని, దాంతో.. లోకల్‌ ట్రైన్‌ను దూరంగానే ఆపేసినట్టు తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో..

ఇవి కూడా చదవండి

మరోవైపు.. మంచిర్యాల జిల్లాలో కోర్బా, రాజధాని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు ప్రమాదం తప్పింది. ఈదురుగాలులకు బెల్లంపల్లి- మందమర్రి మధ్య పట్టాలపై హై టెన్షన్ విద్యుత్‌ వైర్లు పట్టాలపై తెగిపడ్డాయి. విషయం తెలియడంతో రైళ్ళను ముందే నిలిపేశారు అధికారులు. రైల్వే సిబ్బంది అలెర్ట్‌తో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. అయితే.. కోర్బా, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్థానిక రైల్వే స్టేషన్‌లో 2గంటలపాటు నిలిచిపోయాయి. దాంతో మంచిర్యాల, కాగజ్‌నగర్‌ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ వైపు వెళ్లే సూపర్‌పాస్ట్‌ రైళ్లు బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు అధికారులు.

ఏదేమైనా ఒడిశా రైలు ప్రమాద ఘటన మరువక ముందే రెండు వేర్వేరు ప్రాంతాల్లో రైళ్లకు సంబంధించి పెను ప్రమాదాలు తప్పినట్లు అయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..