భక్తులు లేకుండానే జగన్నాథుని స్నాన పూర్ణిమ ఉత్సవాలు

| Edited By:

Jun 05, 2020 | 7:06 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీని ప్రభావం సామాన్యులపైనే కాదు.. అటు దేవుళ్లపై కూడా పడుతోంది. ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన వేడుకలు సాధారణంగా జరుగుతున్నాయి.

భక్తులు లేకుండానే జగన్నాథుని స్నాన పూర్ణిమ ఉత్సవాలు
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీని ప్రభావం సామాన్యులపైనే కాదు.. అటు దేవుళ్లపై కూడా పడుతోంది. ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన వేడుకలు సాధారణంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథుడి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరితో సహా.. యావత్ ప్రపంచ దేశాల్లో ఈ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే ఈ ఏడాది జగన్నాథుడిపై కూడా కరోనా ప్రభావం చూపుతోంది. అయితే కార్యక్రమాలు జరిగినా… పెద్ద ఎత్తున భక్తులు హాజరుకావడానికి అనుమతులు లేవు. ప్రతి ఏటా వార్షిక రథయాత్రకు ముందు జరిగే స్నాన పూర్ణిమ ఉత్సవాలు శుక్రవారం నాడు సాధారణంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. నిబంధనలను పాటిస్తూ ఈ వేడుకలుజ జరిపారు. ఈ కార్యక్రామనికి భక్తులను అనుమతించలేదు. ఇక ఈ నెల 23వ తేదీన జగన్నాథ రథయాత్ర కొనసాగనుంది.

ఇక స్నాన పూర్ణిమ ఉత్సవాలు గురువారం రాత్రి ప్రారంభమై.. శుక్రవారం తెల్లవారు జాము 3.10 గంటలకు పూర్తయ్యాయి. జగన్నాథుని ఆలయంలోని గర్భ గుడి నుంచి జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్రలను తీసుకొచ్చి 108 కలశాలతో స్నాన కార్యక్రమం చేయించారు. ఆ తర్వాత అందరికీ నూతన వస్త్రాలంకరణ చేశారు.