వివాదాస్పద రైతు చట్టాలు మూడింటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మళ్ళీ ఆందోళన ప్రారంభించారు. ఈ డిమాండుతో తమ నిరసన మొదలు పెట్టి బుధవారంతో ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా బ్లాక్ డే ని పాటించిన వారు.. ఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్, సింగు బోర్డర్లలో తిరిగి ప్రొటెస్ట్ కి దిగారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ సరిహద్దులకు చేరుకున్నారు. ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతల దిష్టి బొమ్మలను వారు దహనం చేశారు., ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము కోవిద్ ని వ్యాపింపజేయడంలేదని, నిజానికి రోగ నిరోధక శక్తిని పెంచే పంటలు పండిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. మొదట పంజాబ్, హర్యానా రాష్ట్రాలకే పరిమితమైన తమ ఆందోళన, ఉత్తరాఖండ్, యూపీ వంటి పలు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించిందని వారన్నారు.
తాను డిసెంబరు 26 నుంచి ఇక్కడ నిరసన చేస్తున్నానని, రైతు చట్టాలను రద్దు చేసేవరకు ఎన్ని రోజులైనా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటానని యూపీకి చెందిన ఓ రైతు చెప్పాడు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అనేకమంది రైతులు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి బ్లాక్ డే ని పాటించారు. కేంద్రం తమను మళ్ళీ చర్చలకు ఆహ్వానించాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ మేరకకు వారు ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాశారు. వీరికి కాంగ్రెస్, ఎన్సీపీ,ఆప్,లెఫ్ట్ పార్టీలు మద్దతునిస్తున్నాయి.
మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ : Cyclone Yaas Live Video : అల్లకల్లోలంగా సముద్రతీరం..అతి తీవ్రమైన తుఫానుగా మారిన యాస్ సైక్లోన్..!(వీడియో).
Corona Virus: 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్… చిన్న రాష్ట్రమైన సిక్కింలో కేసుల పెరుగుదల.. ( వీడియో )
Viral Video: వినూత్నంగా ఆకాశం లో ఎగురుతూ పెళ్లి… ఆతర్వాత ఏమైందో తెలిసి షాక్ లో కుటుంబ సభ్యులు.. ( వీడియో )