Chirag Paswan: హనుమంతుడిని చంపుతుంటే.. రాముడు మౌనమా..? మోదీపై చిరాగ్ పాశ్వాన్ ఫైర్..

Chirag Paswan on PM Narendra Modi: హనుమంతుడిని చంపుతుంటే రాముడు మౌనంగా ఉండటం.. ఏమాత్రం సరికాదని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఎంపీ చిరాగ్ పాశ్వాన్.

Chirag Paswan: హనుమంతుడిని చంపుతుంటే.. రాముడు మౌనమా..? మోదీపై చిరాగ్ పాశ్వాన్ ఫైర్..
Chirag Paswan

Updated on: Jun 24, 2021 | 5:57 AM

Chirag Paswan on PM Narendra Modi: హనుమంతుడిని చంపుతుంటే రాముడు మౌనంగా ఉండటం.. ఏమాత్రం సరికాదని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఎంపీ చిరాగ్ పాశ్వాన్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. త‌న తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్జేపీ)లో చీలిక‌తో ఉక్కిరిబిక్క‌ర‌వుతున్న చిరాగ్ పాశ్వాన్.. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీపై త‌న విమ‌ర్శ‌లు చేశారు. హనుమంతుడిని చంపుతుంటే రాముడు మౌనంగా ఉండటం సరికాదంటూ ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి తాను న‌మ్మినబంటును అని, మోదీ రాముడైతే తాను హనుమంతుడిన‌ంటూ చిరాగ్‌ పాశ్వాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. లోక్‌స‌భలో ఎల్జేపీ నేత హోదా నుంచి ఈ మధ్యనే చిరాగ్ ఉద్వాసనకు గురైన నేపథ్యంలో ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

సత్యయుగం నాటి నుంచి నేటి వరకూ రామాయణంలో మనం చూస్తున్నాం. రాముడి ప్రతి నిర్ణయానికి హనుమంతుడు బాసటగా నిలుస్తూ వచ్చాడు. రాముడి అడుగులో అడుగు వేసి నడిచేవాడు హనుమంతుడు అంటూ పాశ్వాన్ పేర్కొన్నారు. ఎల్‌జేపీ కూడా చేసింది అదేనని.. నరేంద్ర మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిచ్చిందని చిరాగ్ పేర్కొన్నారు. బీజేపీకి హనుమంతుడు ప్రతిసారి మద్దతుగా నిలిచినప్పుడు, ఎల్జేపీ సంక్షోభంలో ఉంటే బీజేపీ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తుందని అశిస్తామని కానీ.. బీజేపీ మౌనం తనకు విచారం కలిగిస్తోందని చిరాగ్ పేర్కొన్నారు.

Also Read:

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ సమక్షంలోనే పోలీసుల ఘర్షణలు.. …షాక్ తిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Shocking Visuals: నిర్దాక్షిణ్యంగా పదిహేడేళ్ళ బాలికను రెండంతస్థుల భవనంపై నుంచి నెట్టేసిన దుండగులు.. షాకింగ్ వీడియో!

 

Follow Us