సమయానికి రైలు ఎక్కలేకపోయారా.. అయితే మీ టికెట్ సొమ్ము వాపస్.. అయితే ఈ అవకాశం ఎక్కడో తెలుసా..

|

Jan 27, 2021 | 12:04 AM

Northern Railway: గత కొద్ది రోజులుగా నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

సమయానికి రైలు ఎక్కలేకపోయారా.. అయితే మీ టికెట్ సొమ్ము వాపస్.. అయితే ఈ అవకాశం ఎక్కడో తెలుసా..
Follow us on

Northern Railway: గత కొద్ది రోజులుగా నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్‌ పరేడ్‌‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఒక్కసారిగా దేశ రాజధాని దద్ధరిల్లింది. ఎర్రకోట, ఇండియా గేట్‌ వైపు దూసుకొస్తున్న రైతులను కట్టడిచేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు, బస్సులు ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీంతో వందలాది మంది ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైళ్లు అందుకోలేకపోయారు. దీంతో ప్రయాణాలు రద్దైన వారికి ఉత్తర రైల్వే అధికారులు ఊరట కల్పించారు. రైళ్లు అందుకోలేని వారికి టికెట్‌ సొమ్ము తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు. కొత్త దిల్లీ, పాత దిల్లీ, నిజాముద్దీన్‌, ఆనంద్‌ విహార్‌, సప్ధర్‌గంజ్‌, సరై రోహిలా స్టేషన్ల నుంచి బయల్దేరే రైళ్లకు మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నట్టు అధికారులు స్పష్టంచేశారు. ఈ రోజు రాత్రి 9గంటల లోపు రైళ్లు ఎక్కలేకపోయిన వారికి టిక్కెట్‌ రుసుం వెనక్కి ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Shardul Thakur: ఆ సిక్సర్ గురించి ముందస్తు ప్రణాళిక ఏం రచించలేదు.. క్రీజు నుంచి బయటకి వచ్చి భారీషాట్ ఆడానంతే..