PM Modi: మోదీ హయాంలో దేశంలోని ఆ ప్రాంతాలకు మహర్దశ

|

Dec 07, 2024 | 12:46 PM

ఈశాన్య భారతం మోదీ హయాంలో ఎంతో ఆర్థిక, సామాజిక పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. మరింత వృద్ధి దిశగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల చేస్తోందన్నారు.

PM Modi: మోదీ హయాంలో దేశంలోని ఆ ప్రాంతాలకు మహర్దశ
Northeast India
Follow us on

2014 నుంచి ఈశాన్య భారతం అద్భుతమైన పురోగతి దిశగా సాగుతుందని.. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు, రవాణా, విద్య, సేంద్రీయ వ్యవసాయంలో అపూర్వమైన పురోగతిని ఉందని చెప్పారు.

బడ్జెట్ పెరుగుదల: 300% పెరుగుదల

2014లో రూ. 36,108 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరగ్గా…. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 94,680 కోట్లకు ఈశాన్య భారతానిరి బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని మంత్రి వెల్లడించారు. బడ్జెట్ పెంపు ఏకంగా 300 శాతానికి పైగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక ప్రోత్సాహం ఆ ప్రాంత అభివృద్ధి పట్లు ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు.

జాతీయ రహదారుల విస్తరణ: 28% వృద్ధి

ఈనాన్య రాష్ట్రల్లో రహదారి విస్తరణ విషయంలో ప్రభుత్వం రాజీ పడలేదని మంత్రి తెలిపారు.  జాతీయ రహదారుల (NHs) సంఖ్య 2014లో 80 ఉండగా… 2023 నాటికి 103కి పెరిగిందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రహదారి ప్రాజెక్టులు 4,016 కి.మీ కంటే ఎక్కువే ఉన్నట్లు తెలిపారు.

రైల్వేలు, విద్యుదీకరణ, కనెక్టివిటీ

ఈశాన్య రాష్ట్రల్లో నెట్‌వర్క్ గొప్ప మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం ఏటా 193 కి.మీ పైగా కొత్త రైలు మార్గాలు ప్రారంభమయ్యాయి.  బ్రాడ్-గేజ్ లైన్ల విషయంలో 100 శాతం విద్యుదీకరణను సాధించింది. ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ 370 శాతం పెరిగింది.

విమానయాన వృద్ధి

  • 17 విమానాశ్రయాలు ఇప్పుడు ఈశాన్య ప్రాంతాలకు సేవలు అందిస్తున్నాయి. ఒక దశాబ్దంలో ఇది గణనీయమైన పెరుగుదల అని చెప్పాలి.
  • వీక్లీ ఫ్లైట్‌లలో 113 శాతం పెరుగుదల ఉంది.

విద్య, సేంద్రీయ వ్యవసాయం

విద్యా, వ్యవసాయ కార్యక్రమాలు కూడా ఈశాన్య రాష్ట్రల్లో వృద్ధిని సంతరించుకున్నాయి.

  • ఈశాన్య ప్రాంతంలో యూనివర్సిటీల సంఖ్య 39 శాతం పెరిగింది.
  • 1.55 లక్షల హెక్టార్లకు పైగా భూమిని సేంద్రీయ వ్యవసాయం కోసం ఉపయోగించారు. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అక్కడ ప్రోత్సహిస్తున్నారు.

4G కనెక్టివిటీ, డిజిటల్ అభివృద్ధి

అక్కడ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా అభివృద్ధి చెందింది.  ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు ప్రతి మారుమూలకు 4G సేవలు అందుతున్నాయి.

అంతర్గత జలమార్గాలు

ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా అంతర్గత జలమార్గాలను కొత్త జీవం పోసింది మోదీ సర్కార్.  ఈశాన్య రాష్ట్రాల పురోగతిని సోనోవాల్ వివరంగా చెప్పారు. ఆర్థిక, పర్యావరణ అనుకూల రవాణాను ప్రారంభించడానికి  నదీ జలాల నెట్‌వర్క్‌ విపరీతంగా పెంచినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసవ ఇక్కడ క్లిక్ చేయండి..