Kim Jong Un: తగ్గేదే లే అంటున్న కిమ్ జోంగ్ ఉన్.. న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌ తయారీ..

ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో అమలు చేసే కఠినమైన ఆంక్షలతో ఇప్పటికీ అక్కడి ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. ఉత్తరకొరియాలో ఇంకా ఆకలి చావులు ఉన్నాయి. కానీ కిమ్ జోంగ్ ఉన్ మాత్రం అవేమీ పట్టనట్లు ఉన్నాడు. ముఖ్యంగా న్యూక్లియర్ ఆయుధాలపై అతడు దృష్టిసారిస్తున్నాడు. కిమ్ ఇప్పటిదాకా ఎలాంటి అణు కార్యక్రమాలను ఆపడం లేదు. నన్ను ఎవరు ఆపేది అనే రీతిలో ముందుకెళ్తున్నాడు. తాజాగా ఉత్తర కొరియా ఓ సంచలన ప్రకటన చేసింది.

Kim Jong Un: తగ్గేదే లే అంటున్న కిమ్ జోంగ్ ఉన్.. న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌ తయారీ..
Nuclear Attack Submarine

Updated on: Sep 08, 2023 | 12:27 PM

ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో అమలు చేసే కఠినమైన ఆంక్షలతో ఇప్పటికీ అక్కడి ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. ఉత్తరకొరియాలో ఇంకా ఆకలి చావులు ఉన్నాయి. కానీ కిమ్ జోంగ్ ఉన్ మాత్రం అవేమీ పట్టనట్లు ఉన్నాడు. ముఖ్యంగా న్యూక్లియర్ ఆయుధాలపై అతడు దృష్టిసారిస్తున్నాడు. కిమ్ ఇప్పటిదాకా ఎలాంటి అణు కార్యక్రమాలను ఆపడం లేదు. నన్ను ఎవరు ఆపేది అనే రీతిలో ముందుకెళ్తున్నాడు. తాజాగా ఉత్తర కొరియా ఓ సంచలన ప్రకటన చేసింది. టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్‌ను తయారుచేసినట్లు తెలిపింది. అయితే రెండు రోజుల క్రితమే ప్యాంగ్యాంగ్‌లో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పాల్గొన్నాడు. కిమ్ ఓ షిప్ యార్డులో ఉండి సబ్‌మెరైన్‌ను పరిశీలుస్తున్నటువంటి ఫొటోను విడుదల చేసింది నార్త్ కొరియా.

మరో విషయం అంటే ఈ సబ్‌మెరైన్ నుంచి అణ్వాయుధాలను కూడా ప్రయోగించవచ్చని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఇది సోవియట్ కాలంలో ఉన్నప్పటి రోమియో శ్రేణి సబ్‌మెరైన్ డిజైన్ ఆధారంగా ఈ సబ్‌మెరైన్ తయారుచేసినట్లు నిపుణలు పేర్కొంటున్నారు. ఈ కొత్త సబ్‌మెరైన్‌కు హీరో కిమ్ గన్-ఓకే అని నామకరణం చేశారు. అయితే దీని హల్ నెంబర్ 841. ఈ సబ్‌మెపైన్ నుంచి రెండు వరసల్లో ఏకంగా 10 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించవచ్చు. ఇక రష్యా సబ్‌మెరైన్‌లో ఉత్తరకొరియా చాలా మార్పులు చేసినట్లు నిపణులు అంటున్నారు. ఇది కేవలం అణుదాడి మాత్రమే చేసేది కావచ్చని.. ఈ సబ్‌మెరైన్ అణుశక్తితో నడిచేది కాకపోవచ్చని అమెరికాలోని నిపుణలు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కిమ్ జోంగ్ ఉన్.. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొందరోనే సమావేశమయ్యే అవకాశం ఉందని ఇటీవల ఓ అధికారి చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇక మరో విషయం ఏంటంటే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్నందున రష్యా ఆయుధాల సమీకరణలు చేయాలని అనుకుంటుందని చెప్పారు. అందుకోసమే కిమ్ జోంగ్ ఉన్.. ఆ దేశంలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇక గత నెలలో రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షోయుగు.. ఉత్తర కొరియాకి వెళ్లారని.. అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ చెప్పారు. ఇక క్రెమ్లిన్‌కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అయితే ఇదే సమయంలో సరికొత్త న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్‌ను ప్యాంగ్యాంగ్ ఆవిష్కరించింది. ఇదిలా ఉండగా ఇటీవల అమెరికా-దక్షిణ కొరియా చేపట్టినటువంటి సంయుక్త విన్యాసాలు ముగిసిపోవడంతో నార్త్ కొరయా.. పెద్ద ఎత్తున క్రూయిజ్ క్షిపణుల్ని సముద్రం పై ప్రయోగాలు చేసింది.