Noida Twin Towers:కొన్ని నగరాల్లో భవనాలను చూస్తే ఆకాశాన్ని తాగేలా ఉంటాయి. అందులో వందలాది ఫ్యామిలీలు లేదా ఇతర కంపెనీలు ఉంటాయి. చాలా ఏళ్లకాలంగా ఉన్న భవనాలను సైతం అధికారులు కూల్చివేస్తుంటారు. ఇప్పుడు నోయిడాలో జంట భవనాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు అధికారులు. ఢిల్లీకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ కంపెనీ నిర్మించిన రెండు భవనాలను అధికారులు నేలమట్టం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. ఈనెల 28న ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కూల్చివేత ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే ఈ కూల్చివేత ప్రక్రియలో నిబంధనలు పాటించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అధికారులతో ముందుస్తుగా సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు సీఎం. ఈ భవనాల కూల్చివేత సందర్భంగా చుట్టుపక్కల ఉండేవారిని ఖాళీ చేయించారు. జంట భవనాల చుట్టు ఉన్న రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నోయిడా అధికారులు. ఈ సందర్భంగా గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేలో ఆరగంట పాటు బంద్ నిర్వహించనున్నారు. కూల్చివేత ప్రాంతం వైపు వాహనాలు, జనాలు రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్లాట్లు కొన్నవారికి డబ్బులు వాపసు: సుప్రీంకోర్టు
ఈ కూల్చివేతపై సుప్రిం కోర్టులో పిటిషన్ దాఖలైంది. 40 అంతస్తులున్న ఈ జంటభవనాల్లో ప్లాట్లు కొన్నవారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్‌టెక్ పూర్తి మొత్తం తిరిగి చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. కొనుగోలుదారుల కోసం తక్షణ అవసరాల నిమిత్తం కోటి రూపాయలు తమ రిజిస్ట్రీలో జమ చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్,జిస్టిస్ ఏఎస్ బొప్ప, జస్టిస్ బేబీ పర్దీవాలాల ధర్మాసనం నిర్మాణం కంపెనీను ఆదేశించింది. ఇందు కోసం సెస్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. 59 మంది ప్లాట్ల కొనుగోలుదారులకు మాత్రమే ఈ రీఫండ్ చేయాల్సి ఉందని, మిగతా వారికి ప్రత్యామ్నాయం చూపినట్లు కంపెనీ కోర్టుకు వివరించింది.
భవనాల నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘన
అయితే ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్‌ను నిర్మించింది. 2009 లో నోయిడా అధికారులతో సదరు కంపెనీ కుమ్మక్కై చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనల విన్న సుప్రీంకోర్టు, ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని తీర్పు ఇచ్చింది. ఇక కూల్చివేతతో 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. వాటి తొలగింపుకు కనీసం మూడు నెలల సమయం పట్టనుంది.
100 మీటర్ల ఎత్తులో జంట భవనాలు
ఈ జంట భవనాలు 100 మీటర్ల ఎత్తు ఉన్నాయి. చుట్టూ 500 మీటర్ల మేర జనసంచారం లేకుండా అధికారుల చర్యలు చేపడుతున్నారు. కూల్చివేత సమయంలో చుట్టుపక్కల వారి కోసం ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు మూడు ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య బృందం, మందులు, ఆరు అంబులెన్స్‌లు సిద్ధం చేశారు అధికారులు. భవనాలు కూలుతున్న సమయంలో దుమ్మూ, ధూళి పైకి ఎగరకుండా ఆ ప్రాంతంలో ఇను జాలీలు, కవర్లతో కప్పిం ఉంచారు. ఈ కూల్చివేతలో ఈ భవనాలకు 50 నుంచి 70 మీటర్ల దూరంలో ఉండి బటన్ నొప్పి, కేవలం 9 సెకన్లలోనే పేల్చివేత ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా పేల్చివేత సమయంలో ఒక నాటికల్ మైలు (1.8.కి.మీ) దూరంలో అకాశంలో విమానాల రాకపోకలను నిషేధించినట్లు నోయిడా అథారిటీ తెలిపింది. ఇందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఆమోదం కూడా పొందారు. ఈ ప్రాంతంలో డ్రోన్లను సైతం నిషేధించారు.
కూల్చివేతకు 3,700 పేలుడు పదార్థాలు
కూల్చివేతతో సుమారు 50 వేల టన్నులు చెత్త జమ కానుంది. ఈ చెత్తను తొలగించేందుకు సుమారు మూడు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. అలాగే ఈ జంట భవనాలను కూల్చివేతకు 3,700 పేలుడు పదార్థాలను వాడారు. రెండు టవర్లలో 9,600 రంధ్రాలు చేసి పేలుడు పదార్థాలను నింపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి